Gold Price: ప్రస్తుత గోల్డ్ మార్కెట్ చూస్తుంటే పసిడి ప్రియుల మదిలో మెదిలే మొదటి ప్రశ్న, గోల్డ్ రేట్ ఎటు వైపు?. ఎందుకంటే గోల్డ్ రేట్ ఒక వారం క్రిందకు దిగుతూ ఉంటే మరొక వారం పైపైకి వెళుతోంది. అందుకే, గోల్ మార్కెట్ మరియు బంగారం ధరల పైన పసిడి ప్రియులు కొంత నెమ్మదిస్తున్నారు. మరి ఈ వారం గోల్డ్ రేట్ అప్డేటట్ వివరాలతో పాటుగా ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ లను కూడా తెలుసుకుందామా.
ఈరోజు బంగారం ధర (24K 10గ్రా) ప్రధాన మార్కెట్ లో రూ. 60,160 వద్ద ప్రారంభమై మార్కెట్ ముగిసే సమయానికి రూ. 110 క్రిందకు దిగి రూ. 60,050 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. అదే విధంగా, ప్రధాన్ మార్కెట్ లో (22K ఆర్నమెంట్ 10గ్రా) ప్రధాన మార్కెట్ లో రూ. 55,150 వద్ద ప్రారంభమై మార్కెట్ ముగిసే సమయానికి రూ. 100 క్రిందకు దిగి రూ. 55,050 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఇక ఈ వారం మొత్తం మీద గోల్డ్ మార్కెట్ మరియు గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈ సోమవారం రూ. 59,400 వద్ద మొదలైన 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర తులానికి 650 రూపాయలు పెరుగుధలను నమోదు చేసి రూ. 60,050 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఈ వారం మొత్తం మీద ఆగష్టు 31వ తేదీ గోల్డ్ మార్కెట్ గరిష్టాన్ని చూసింది. ఆగష్టు 31వ తేదీ మార్కెట్ లో గోల్డ్ రేట్ రూ. 60,160 రూపాయల అత్యధిక రేటును చూసింది.
గత నెల గోల్డ్ రేట్ మార్కెట్ మూడు నెలల కనిష్ఠాన్ని కూడా చవి చూసింది. ఆగష్టు 17 వ తేదీ నుండి ఆగష్టు 20 వ తేదీ వరకూ గోల్డ్ రేట్ కనిష్ఠ ధరలో కొనసాగింది. ఆగష్టు 17న ఒక తులం 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 59,020 రూపాయల్ కనిష్ఠ రేటును నమోదు చేసింది.