Gold: గత కొంత కాలంగా చుక్కలు చూపిస్తోంది. గత సంవత్సరం చివరి వరకూ దాదాపుగా నిలకడగా కొనసాగిన బంగారం, ఈ సంవత్సరం మాత్రం చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా, ఈ నెలలో పసిడి ప్రియులతో పాటుగా ఇన్వెస్టర్ లకు కూడా మింగుడు పడకుండా గోల్డ్ సాగిపోతోంది. గత వారం మార్కెట్ కూడా దాదాపుగా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యింది గోల్డ్ మార్కెట్. ఈరోజు లో గోల్డ్ నిలకడగా కొసాగినా రేట్ మాత్రం దాదాపుగా 62 వేల మార్క్ వద్ద కొసాగుతోంది. ఈరోజు (మే 15) గోల్డ్ మార్కెట్ అప్డేట్ వివరాలు చూద్దమా.
ఈరోజు Gold Live మార్కెట్ వివరాలికి వెళితే, ఈరోజు 24K స్వచ్ఛమైన గోల్డ్ (10గ్రా) రేటు రూ. 61,800 వద్ద నిలకడగా కొనసాగుతుండగా, 22K ఆర్నమెంట్ గోల్డ్ (10గ్రా) రేట్ రూ. 56,650 వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఇది ప్రధాన మార్కెట్ లో గోల్డ్ ధర మరియు మేజర్ సిటీ లలో మరియు ప్రాంతాల్లో గోల్డ్ వివరాలను క్రింద చూడవచ్చు.
ఈరోజు చెన్నైలో గోల్డ్ మార్కెట్ ఎప్పటి లాగానే అధిక ధర కోట్ చేసింది. ఈరోజు చెన్నై మార్కెట్ లో 22K (10గ్రా) ధర రూ. 57,150 వద్ద మరియు 24K (10గ్రా) బంగారం ధర రూ. 62,350 వద్ద కొనసాగుతోంది. అయితే, తెలుగురాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్ లలో ప్రధాన మార్కెట్ ధరలే నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో 22K (10గ్రా) ధర రూ. 56,650 వద్ద మరియు 24K (10గ్రా) బంగారం ధర రూ. 61,950 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ, ముంబై, మరియు కలకత్తా సహా మిగిలిన అన్ని ప్రధాన మార్కెట్ లలో దాదాపుగా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కెవాలం చెన్నై మార్కెట్ లో మాత్రం గోల్డ్ రేట్ 62 వేల మార్క్ పైన కొనసాగుతోంది
Note: ఆన్లైన్ మార్కెట్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మర్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయి..