Gold: రోజు రోజుకు పడిపోతున్న బంగారం ధర.. New Price update తెలుసుకోండి.!
Gold: అక్టోబర్ నెల చివరి రోజు నష్టాలతో ముగిసిన గోల్డ్ మార్కెట్
వంబర్ నెల మొదటి రోజైన ఈరోజు కూడా నష్టాలనే చూసింది
ఈరోజు గోల్డ్ New Price update ఏమిటో తెలుసుకుందాం
Gold: అక్టోబర్ నెల చివరి రోజు నష్టాలతో ముగిసిన గోల్డ్ మార్కెట్, నవంబర్ నెల మొదటి రోజైన ఈరోజు కూడా నష్టాలనే చూసింది. గత నెల మొత్తం గోల్డ్ మార్కెట్ దాదాపుగా పెరుగుదలనే నమోదు చేస్తూ వచ్చింది మరియు ఒకదశలో 62 వేల మార్క్ పైన రేటును నమోదు చేసింది. అయితే, నెల చివరిలో నష్టాలను చుసినా తరువాత 61 వేల మార్క్ పైన అక్టోబర్ నెల క్లోజింగ్ ను నమోదు చేసింది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా కొనసాగింది మరియు ఈరోజు గోల్డ్ New Price update ఏమిటో తెలుసుకుందాం.
Todays Gold Market:
ఈరోజు గోల్డ్ మార్కెట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు గోల్డ్ ధర నష్టాలను చూసింది. ఈరోజు ఉదయం రూ. 61,850 రూపాయల వద్ద ప్రారంభమైన గోల్డ్ మార్కెట్ తులానికి రూ. 320 రూపాయల నష్టాన్ని చూసి రూ. 61,530 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. సాధారంగా దీపావళి సమయంలో దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీ లాభాలను చూస్తుంటాయి. అయితే, ప్రస్తుతం దీనికి విరుద్ధంగా మార్కెట్ నడుస్తోంది. కానీ, గోల్డ్ మార్కెట్ ఎప్పుడైనా మారే అవకాశం ఉంటుంది.
24 Carat గోల్డ్ రేట్
ఈరోజు మార్కెట్ లో నడుస్తున్న 24 Carat గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 Carat గోల్డ్ రేట్ రూ. 61,530 రూపాయల వద్ద కొనసాగుతోంది మరియు నిన్నటి రేటుతో పోలిస్తే ఈరోజు బంగారం ధర తులానికి రూ. 320 రూపాయలు క్రిందకు దిగింది.
Also Read : Lava Blaze 2 5G: లార్డ్ ఆఫ్ 5G క్యాప్షన్ తో New ఫోన్ లాంచ్ చేస్తున్న లావా.!
22 Carat గోల్డ్ రేట్
ఇక 22 Carat గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 Carat గోల్డ్ రేట్ రేట్ నిన్నటితో పోలిస్తే తులానికి రూ. 300 రూపాయలు క్రిందకు దిగి రూ. 56,400 వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
నవంబర్ గోల్డ్ రేట్ మార్కెట్
అక్టోబర్ నెలలో బంగారం ధర భారీగా పెరుగుదలను నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, నవంబర్ 2023 ప్రారంభం అవుతూనే గోల్డ్ మార్కెట్ నష్టాలతో మొదలయ్యింది. అయితే, Diwali 2023 నాటికీ గోల్డ్ రేట్ ఈ సంవత్సరం గరిష్టాన్ని చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇది అంచనా మాత్రమే మరియు దీపావళి పండుగ సందర్భంగా బంగారం కొనడాన్ని ప్రజలు శుభప్రదంగా భావిస్తారు కాబట్టి, సహజంగానే బంగారం ధర పెరిగే అవకాశం వుంటుంది.
గమనిక : ఆన్లైన్ మరియు లోకల్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి