Gold Market Update: మెల్లగా పెరుగుతున్న గోల్డ్ మార్కెట్.!
గోల్డ్ మార్కెట్ ఈరోజు కూడా స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది
ఈ నెల ప్రారంభం నుండి గోల్డ్ మార్కెట్ విపరీత పరిణామాలను చూసింది
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మెల్లగా పెరుగుతోంది గోల్డ్ రేట్
Gold Market Update: మెల్లగా పెరుగుతున్న గోల్డ్ మార్కెట్ ఈరోజు కూడా స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది. ఈ నెల ప్రారంభం నుండి గోల్డ్ మార్కెట్ విపరీత పరిణామాలను చూసింది. ఎందుకంటే, నెల ప్రారంభంలో భారీ రేటు వద్ద ఆరంభమైన గోల్డ్ మార్కెట్, మెల్లగా క్రిందకు దిగజారింది. అయితే, ఎంత క్రిందకు దిగజారినా 63 వేల మార్క్ వద్దనే నడయాడింది. అయితే, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మెల్లగా పెరుగుతోంది గోల్డ్ రేట్.
Gold Market Update:
ముందుగా తెలిపి విధంగా గోల్డ్ మార్కెట్ జనవరి 2024 నెలలోఓడిదిడుకులను చేసింది. అయితే, ఓవరాల్ గా మాత్రం చాలా స్థిరంగా కొనసాగింది. ఈ నెలలో ఎక్కువ భాగం బంగారం ధర 63 వేల రూపాయల వద్దనే ఎక్కువగా కొనసాగింది. అంతేకాదు, గత 10 రోజుల్లో గోల్డ్ మార్కెట్ 62 నుండి 63 వేల రూపాయల ఒకే రేటు వద్ద చాలా స్థిరంగా కొనసాగింది. అయితే, నిన్న మరియు ఈరోజు స్వల్పంగా పెరుగుధలను చూసింది.
Also Read: Jio పటాకా ఆఫర్: 90 రోజులు Unlimited కాలింగ్ మరియు 5G డేటా అందుకోండి.!
24 Carat గోల్డ్ రేట్
ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 24 Carat గోల్డ్ రేట్ రూ. 63, 270 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది. ఈరోజు మార్కెట్ లో ఒక తులం బంగారం ధర రూ. 220 రూపాయలు పెరిగింది. నిన్న మార్కెట్ లో ఒక తులం బంగారం ధర రూ. 100 రూప్యాలు పెరిగింది. అంటే, నిన్న మరియు ఈరోజు మీద ఒక తులం బంగారం ధర రూ. 320 రూపాయలు పెరిగింది.
22 Carat గోల్డ్ రేట్
ఇక ఈరోజు మార్కెట్ లో కొనసాగిన 10 గ్రాముల 24 Carat గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఒక తులం గోల్డ్ రేట్ రూ. 58, 000 రూపాయల వద్ద క్లోజింగ్ ను చూసింది. ఈరోజు మార్కెట్ లో ఒక తులం 22 క్యారెట్ బంగారం ధర రూ. 200 పెరిగింది. గడిచిన రెండు రోజుల్లో ఒక తులం బంగారం ధర రూ. 300 రూపాయలు పెరిగింది.