Gold Market Update: ఈరోజు గోల్డ్ రేట్ మరియు మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి.!
ఈరోజు గోల్డ్ మార్కెట్ స్వల్పంగా క్రిందకు దిగింది
నిన్న మార్కెట్ లో 64 వద్ద నిలిచిన బంగారం ధర
బంగారం ధర అధిక రేటులోనే కొనసాగుతోందని పసిడి ప్రియులు వాపోతున్నారు
Gold Market Update: ఈరోజు గోల్డ్ మార్కెట్ స్వల్పంగా క్రిందకు దిగింది. నిన్న మార్కెట్ లో 64 వద్ద నిలిచిన బంగారం ధర ఈరోజు మాత్రం 63 వేళా రూపాయల మార్క్ కు దిగింది. అయితే, ఇప్పటికీ బంగారం ధర అధిక రేటులోనే కొనసాగుతోందని పసిడి ప్రియులు వాపోతున్నారు. 2023 సంవత్సరం ప్రారంభంలో 55 వేల రూపాయల వద్ద మొదలైన బంగారం ధర 2023 చివరి నాటికి 63 వేల రూపాయల వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది. అంటే, అర్ధం చేసుకోవచ్చు 2023 సంవత్సరంలో బంగారం ధర ఎంతగా పెరిగిందో అని.
Gold Market Update
ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ స్వల్పంగా తరుగుదలను చూసింది. అంతేకాదు, నిన్న 64 వేల మార్క్ పైన కొనసాగిన గోల్డ్ రేట్, ఈరోజు 63 వేల కు దిగింది. అయితే, ఈరోజు ఓల్డ్ రేట్ లో పెద్ద మార్పును మాత్రం చూడలేదు. ఇక ఈరోజు రేటు విషయానికి వస్తే, ఈరోజు రూ. 63,820 రూపాయల వద్ద గోల్డ్ రేట్ ముగిసింది.
ఈరోజు 24 క్యారెట్ ధర
ఈరోజు మార్కెట్ లో కొనసాగిన 24 క్యారట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 64,090 రూపాయల నుండి క్రిందకు దిగి రూ. 63,820 రూపాయల వద్దకు చేరుకుంది. అంటే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్ రేట్ రూ. 270 రూపాయలు క్రిందకు దిగింది.
Also Read : Tecno Pop 8: కొత్త డిజైన్ కొత్త ఫీచర్లతో సరసమైన ధరలో వచ్చింది.!
ఈరోజు 22 క్యారెట్ ధర
ఇక 22 క్యారెట్ గోల్డ్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 58,750 రూపాయల నుండి క్రిందకు దిగి రూ. 58,500 రూపాయల వద్దకు చేరుకుంది. అంటే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 250 రూపాయలు క్రిందను దిగింది.
ఇక గత నెలతో పోలిస్తే, ప్రస్తుత గోల్డ్ మార్కెట్ కూడా అప్ డౌన్ ట్రెండ్ ను కొనసాగుతున్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే, సంవత్సరం మొదటి రోజు స్వల్పంగా పెరిగిన బంగారం ధర, మరుసటి రోజే మళ్ళీ క్రిందకు దిగింది. అయితే, గోల్డ్ మార్కెట్ ఈ సంవత్సరం 2024 లో 65 వేల రూపాయలను దాటవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అంచనా ధరలకు మరియు మార్కెట్ అంచనా లకు పెద్ద తేడా లేదు కాబట్టి ఇది జరిగే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, గోల్డ్ మార్కెట్ ఈ సంవత్సరం ఎలా కొనసాగుతుందో వేచి చూడాలి.