మే 24 గోల్డ్ రేట్: ఈరోజు మార్కెట్ లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర. నిన్న మార్కెట్ లో 360 రూపాయల తరుగుదలను చూసిన తులం బంగారం ధర, ఈరోజు మాత్రం తులానికి రూ. 260 పెరిగింది. పెరిగింది చాలా చిన్న మొత్తమే అయినా గత వారం చివరిలో హఠాత్తుగా పెరిగిన మాదిరిగా గోల్డ్ రేట్ ఒక్కసారిగా పెరుగుతుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం, దేశవ్యాప్తంగా రూ. 2,000 నోట్ లను వెనక్కు తీసుకుంటున్నట్లు చేసిన ప్రకటన ఇందుకు కారణంగా చెబుతున్నారు. అంతేకాదు, 2000 నోట్స్ ఉపసంహరణ వార్త ను ప్రకటించిన రోజునే గోల్డ్ రేట్ భారీగా పెరుగుదలను చూడటాన్ని కూడా ఉదాహరణగాచెబుతున్నారు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఎలా కొనసాగుతున్నాయో చూద్దాం పదండి.
ఈరోజు మార్కెట్ లో స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం రేట్ (10గ్రా) 260 రూపాయల లాభాన్ని చూసి రూ. 61,360 వద్ద ముగిసింది. అలాగే, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 56,250 రూపాయల వద్ద ముగిసింది. ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలలో ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. అంటే, హైదరాబాద్, విజయవాడ మరియు వైజాగ్ మార్కెట్ లలో (10గ్రా) 24K పసిడి ధర రూ. 61,360 వద్ద మరియు (10గ్రా) 22K పసిడి ధర రూ. 56,250 వద్ద కొనసాగుతున్నాయి.