Gold Market Update: ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగిన గోల్డ్ సూచీలు.!

Gold Market Update: ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగిన గోల్డ్ సూచీలు.!
HIGHLIGHTS

గత రెండు రోజులుగా మార్కెట్లో లాభాలను చూసిన గోల్డ్ రేట్

గోల్డ్ రేట్ ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగింది

ఈరోజు కూడా గోల్డ్ మార్కెట్ 69 వేల రూపాయల మార్క్ వద్దనే కొనసాగుతోంది

Gold Market Update: గత రెండు రోజులుగా మార్కెట్లో లాభాలను చూసిన గోల్డ్ రేట్ ఈరోజు స్వల్పంగా క్రింది. అయితే గత పది రోజుల్లో పెరిగిన పోలిస్తే ఈరోజు తగ్గింది అంత పెద్ద అమౌంట్ అయితే కాదు. కానీ, గత పది రోజులుగా ఆగకుండా జరుగుతున్న ధరకి ఈరోజు కళ్లెం పడినట్లు అయ్యింది. మరి ఈరోజు దేశంలో కొనసాగుతున్న గోల్డ్ రేట్ మరియు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఏమిటో తెలుసుకుందామా.

Gold Market Update:

ఈరోజు మార్కెట్లో గోల్డ్ రేట్ స్వల్పంగా నష్టాలను చూసింది. ఈరోజు ఉదయం రూ. 69,380 వద్ద మొదలైన గోల్డ్ మార్కెట్ రూ. 270 రూపాయల నష్టాన్ని చూసి రూ. 69,110 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. అయితే, గడిచిన రెండు రోజుల్లోనే గోల్డ్ రేట్ రూ. 930 రూపాయల లాభాన్ని చూసింది.

అదే గడిచిన వారం గోల్డ్ మార్కెట్ అప్డేట్ ను కూడా పరిశీలిస్తే, గత వారంలో కూడా భారీగా లాభాలను చూసింది గోల్డ్ మార్కెట్. అంతేకాదు, నిన్న మార్కెట్ లో ఎన్నడూ చూడని విధంగా రూ. 69,380 రూపాయల గరిష్ట రేటును హిట్ చేసింది.

Gold Market Update
Gold Market Update

అయితే, రేటు స్వల్పంగా క్రిందకు దిగజారినా, ఈరోజు కూడా గోల్డ్ మార్కెట్ 69 వేల రూపాయల మార్క్ వద్దనే కొనసాగుతోంది. కానీ, నియోనులు చెబుతున్న మాటలు నిజమని నమ్మితే, గోల్డ్ రేట్ మరింతగా పెరుగుతుందని చెప్పవచ్చు.

Also Read: Smart Watch Deals: డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తున్న టాప్ బ్రాండ్ స్మార్ట్ వాచ్ లు.!

అయితే, గోల్డ్ రేట్ లేదా మార్కెట్ ను అంచనా వేయడం అంత సులభం కాదు. అయితే, గత సంవత్సరం మార్కెట్ తో పోలిస్తే, గోల్డ్ మార్కెట్ 2024 లో భారీగా పెరిగిపోయింది.

24 క్యారెట్ గోల్డ్ రేట్

ఈరోజు మార్కెట్లో నమోదైన 24 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ ఈరోజు రూ. 69,380 వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. నిన్నటి రేటుతో పోలిస్తే ఒక తులానికి రూ. 270 రూపాయల నష్టాన్ని చూసింది.

22 క్యారెట్ గోల్డ్ రేట్

ప్రధాన మార్కెట్ లో నడుస్తున్న 22 క్యారెట్ గోల్డ్ రేట్ ను పరిశీలిస్త, 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ ఈరోజు రూ. 63,350 వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. నిన్నటి రేటుతో పోలిస్తే ఒక తులానికి రూ. 250 రూపాయలు క్రిందకు దిగింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo