Gold Market Update: 20 రోజుల కనిష్ఠానికి పడిపోయిన గోల్డ్ రేట్.!

Gold Market Update: 20 రోజుల కనిష్ఠానికి పడిపోయిన గోల్డ్ రేట్.!
HIGHLIGHTS

మార్కెట్ లో బంగారం ధర రోజు రోజుకు పడిపోతూనే వుంది

20 రోజుల కనిష్ఠాన్ని ఈరోజు గోల్డ్ రేట్ నమోదు చేసింది

ఇన్వెస్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న గోల్డ్ మార్కెట్

Gold Market Update: మార్కెట్ లో బంగారం ధర రోజు రోజుకు పడిపోతూనే వుంది. ఈరోజు మార్కెట్ లో నడుస్తున్న గోల్ రేట్ ను పరిశీలిస్తే, 20 రోజుల కనిష్ఠాన్ని ఈరోజు గోల్డ్ రేట్ నమోదు చేసింది. 2024 ప్రారంభాన్ని అట్టహాసంగా మొదలుపెట్టిన గోల్డ్ మార్కెట్, ఇప్పుడు నష్టాల బాటలో పయనిస్తోంది. ఇన్వెస్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న గోల్డ్ మార్కెట్ యొక్క 20 రోజుల అప్డేట్ మరియు ఈరోజు లైవ్ గోల్డ్ రేట్ వివరాలను పరిశీలిద్దాం.

Gold Market Update

ఈరోజు గోల్డ్ మార్కెట్ స్వల్పంగా క్రిందకు దిగింది మరియు 20 రోజుల కనిష్టానికి పడిపోయింది. నిన్న రూ. 62,950 రూపాయల వద్ద క్లోజింగ్ ను చూసిన గోల్డ్, ఈరోజు కూడా రూ. 120 రూపాయలు క్రిందకు దిగి రూ. 62,830 రూపాయల వద్ద క్లోజింగ్ ను చూసింది.

Gold Market Update  and a man hold gold bar

గత 20 రోజుల మార్కెట్ అప్డేట్

ఇక గత 20 రోజుల మార్కెట్ ను పరిశీలిస్తే, డిసెంబర్ 20 న 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 63,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగింది. అయితే, గోల్డ్ రేట్ డిసెంబర్ నెల చివరి నాటికి బాగా పుంజుకున్న బంగారం ధర డిసెంబర్ 28న రూ. 64,250 రూపాయల గరిష్ట ధరను సెట్ చేసింది. కానీ, డిసెంబర్ 31 నాటికీ మార్కెట్ స్వల్పంగా నష్టాలను చూడటంతో రూ.63,870 రూపాయల రేటును నమోదు చేసింది.

Also Read : POCO X6 Pro 5G: మిడ్ రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లతో లాంఛ్ అయ్యింది.!

కానీ, 2024 జనవరి ప్రారంభం గోల్డ్ రేట్ మరలా తిరిగి పుంజు కోవడంతో జనవరి 2న గోల్డ్ రేట్ మళ్ళీ 64 వేల రూపాయల మార్క్ పైకి చేరుకుంది. జనవరి 2న 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 64,090 రేటు వద్ద కొనసాగింది. అయితే, ఎక్కువ సమయం స్థిరంగా నిలబడలేని గోల్డ్ రేట్, మల్లి తిరిగి పతనాన్ని చూసింది.

3 జనవరి 2024 నుండి మొదలైన గోల్డ్ మార్కెట్ పతనం ఈరోజు వరకూ కూడా వెంటాడింది. మొత్తంగా, గడిచిన 10 రోజుల్లో గోల్డ్ రేట్ రూ. 1,230 రూపాయల పతనాన్ని చూసి ఈరోజు రూ. 63,870 రూపాయల వద్ద నిలిచింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo