Gold Market Update: మళ్ళీ దిగుతున్న బంగారం ధర.!
రూ. 1,000 రూపాయల వరకూ నష్టాలను చూసిన గోల్డ్ మార్కెట్
ఈ నెల ప్రారంభం నుండి స్థిరంగా సాగింది
గోల్డ్ రేట్ లైవ్ అప్డేట్ వివరాలు విపులంగా
Gold Market Update: జనవరి నెల ప్రారంభం నుండి చివరి నాటికి రూ. 1,000 రూపాయల వరకూ నష్టాలను చూసిన గోల్డ్ మార్కెట్, ఈ నెల ప్రారంభం నుండి స్థిరంగా సాగింది. అయితే, గడిచిన రెండు రోజుల నుండి స్వల్పంగా నష్టాలను చూడటంతో, గోల్డ్ రేట్ మళ్ళీ క్రిందకు దిగజారడం మొదలు పెట్టింది. మరియు ఫిబ్రవరి నెలలో కొనసాగిన గోల్డ్ రేట్ అప్డేట్ వివరాలు మరియు ఈరోజు గోల్డ్ రేట్ లైవ్ అప్డేట్ వివరాలు విపులంగా తెలుసుకుందాం.
Gold Market Update
గోల్డ్ రేట్ ఫిబ్రవరి 1వ తేదీ రూ. 63,440 రూపాయల వద్ద ప్రారంభం అయ్యింది. అయితే, రెండు రోజులు వరుసగా పెరిగిం గోల్డ్ రేట్, ఫిబ్రవరి 2న రూ. 63,600 రూపాయల రేటును నందు చేసింది. అయితే, ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఈరోజు వరకూ వరుసగా నష్టాలను చూసిన గోల్డ్ మార్కెట్ ఈ రోజు రూ. 63,000 రూపాయల వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది. అంటే, గడిచిన 6 రోజుల్లో గోల్డ్ ధర రూ. 600 రూపాయలు క్రిందకు దిగింది.
Also Read: valentine’s day 2024: ఐకూ లేటెస్ట్ ఫోన్ పైన ధమాకా ఆఫర్ అనౌన్స్.!
24 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు కొనసాగిన 24 క్యారెట్ గోల్డ్ రేట్ లైవ్ ను చూస్తే, ఈరోజు ఉదయం రూ. 63,220 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ 220 రూపాయలు క్రిందకు దిగి రూ. 63,000 రూపాయల క్లోజింగ్ ను చూసింది.
22 క్యారెట్ గోల్డ్ రేట్
22 క్యారెట్ గోల్డ్ రేట్ ఇక ఈరోజు కొనసాగుతున్న 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 57,750 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. 22 క్యారెట్ గోల్డ్ రేట్ కూడా ఈరోజు రూ. 200 రూపాయలు క్రిందకు దిగింది.