Gold Market Live: ఒకే పందాలో పరిగెడుతున్న గోల్డ్ రేట్.!
ఏ రోజు చూసినా గోల్డ్ మార్కెట్ ఒకే పందాలో పరిగెడుతుంది
ఈనెల ప్రారంభం నుండి మొదలైన గోల్డ్ రేటు పరుగు ఎప్పటికీ అలాగే సాగుతోంది
బంగారం ధర అంతకంతకు భారీ రేట్లను నమోదు చేస్తూనే ఉంది
Gold Market Live: ఏ రోజు చూసినా గోల్డ్ మార్కెట్ ఒకే పందాలో పరిగెడుతుంది. ఈనెల ప్రారంభం నుండి మొదలైన గోల్డ్ రేటు పరుగు ఎప్పటికీ అలాగే సాగుతోంది. ఇప్పటికే దారుణమైన పెరుగుదలను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్ ఇంకా అదే దారిలో నడుస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే బంగారం ధర అంతకంతకు భారీ రేట్లను నమోదు చేస్తూనే ఉంది.
Gold Market Live:
బంగారు మార్కెట్ 2024 సంవత్సరం ప్రారంభం నుండి కూడా మంచి లాభాలను నమోదు చేసింది. జనవరి మరియు ఫిబ్రవరి నెలలో కొంత స్థిరంగా కనిపించినా మార్చి నెల నుండి మాత్రం గోల్డ్ మార్కెట్ భారీ లాభాలను చూసింది. మార్చి నెల చివరినాటికి మెల్లగా 68 వేల రేటు వద్ద కొనసాగిన గోల్డ్ రేట్ ఇప్పుడు మాత్రం 72 వేల దూకుడుగా సాగుతోంది.
ఈ వారం ప్రారంభం నుండి కూడా గోల్డ్ మార్కెట్ వరుసగా లాభాలను నమోదు చేసింది. రోజురోజుకు పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్ ఈరోజు రూ. 72,220 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక ఈనెల ప్రారంభం నుండి కూడా గోల్డ్ మార్కెట్ ని పరిశీలిస్తే, మూడు వేల రూపాయలకు పైగా లాభాలను చూసింది.
Also Read: Smartphone Battery Tips: ఈ టిప్స్ పాటిస్తే మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుంది.!
ఈరోజు గోల్డ్ మార్కెట్
ఈరోజు మార్కెట్లో కొనసాగిన 24 క్యారెట్ మరియు 22 క్యారెట్ గోల్డ్ రేట్ వివరాలను చూస్తే, ఈరోజు 22 క్యారెట్ మరియు 24 క్యారెట్ గోల్డ్ రేట్ స్వల్పంగా పెరిగింది.
24 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు ఉదయం రూ. 72,110 వద్ద ప్రారంభమైన బంగారం ధర రూ. 72,220 వద్ద క్లోజింగ్ ని నమోదు చేసింది. అంటే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 110 రూపాయలు పెరిగింది.
22 క్యారెట్ గోల్డ్ రేట్
ఇక 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, రూ. 66,100 వద్ద మొదలైన గోల్డ్ రేట్ రూ. 66200 రేటును ను చేరుకొని క్లోజింగ్ ను సెట్ చేసింది. అంటే , ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 100 రూపాయలు పెరిగింది.