Gold Market: ఈరోజు పసిడి మార్కెట్ లాభాలను చూసింది. నిన్న మార్కెట్ స్వల్పంగా పడిపోయిన గోల్డ్ రేట్ ఈరోజు మాత్రం మళ్ళీ పెరుగుధలను చూసింది. అంతేకాదు, ఈరోజు గోల్డ్ రేట్ అల్ టైమ్ గరిష్ట రేటును కూడా సెట్ చేసింది. ఈ సంవత్సరం ప్రారంభం నుండే గోల్డ్ రేట్ చాలా దూకుడుగా కొనసాగుతోంది. నిన్నటి క్లోజింగ్ తో పోలిస్తే, ఈరోజు గోల్డ్ రేట్ తులానికి 400 పైగా పెరిగి మళ్ళీ 66 వేల మార్క్ ను దాటింది.
ఈరోజు గోల్డ్ మార్కెట్ లాభాలను చూడటంతో బంగారం ధర స్వల్పంగా పెరిగి 66 వేల రూపాయల మార్క్ ను దాటేసింది. ఇక ఈ వారం మొత్తం మీద కొనసాగిన గోల్డ్ రేట్ విషయానికి, నిన్న బంగారం ధర నష్టాలను చూస్తే ఈరోజు తిరిగి లాభాలను నమోదు చేసింది. అంతే కాదు ఈరోజు గోల్డ్ మార్కెట్ గరిష్ట రేటును నమోదు చేసింది.
Also Read: 100W ఫాస్ట్ ఛార్జ్ టెక్ తో OnePlus Nord CE4 ఫోన్ లాంఛ్ కన్ఫర్మ్.!
ఈరోజు మార్కెట్లో కొనసాగుతున్న 24 క్యారెట్ బంగారం ధర వివరాలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఉదయం రూ. 65,870 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 460 పెరిగి రూ. 66,330 రూపాయల వద్ద క్లోజింగ్ నమోదు చేసింది.
ఇక 22K గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ. 60,380 రూపాయల వద్ద మొదలై రూ. 420 రూపాయలు పెరిగి రూ. 60,800 వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
మొత్తానికి, గోల్డ్ మార్కెట్ భారీ రేటును నమోదు చేసే దిశగా పయనిస్తుందనే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే, నిపుణులు అంచనా వేసిన విధంగా 66 వేళా మార్క్ ను దాటేసింది. ముందు ముందు గోల్డ్ మార్కెట్ ఎటువంటి పరిణామాలను చూస్తుందో వేచి చూడాలి.