Gold Price Live: 2024 సంవత్సరం పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే మార్కెట్ లో భారిగా పెరిగిన గోల్డ్ రేట్ లను చూసి షాక్ కు గురవుతున్న పసిడి ప్రియలకు మరింత షాకిస్తోంది గోల్డ్ మార్కెట్. ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ మొదలైనప్పటి నుండి గోల్డ్ మార్కెట్ భారీగా లాభాలను చూసింది. అంతేకాదు, మార్కెట్ ఎన్నడూ చూడని దిశగా ఈరోజు గోల్డ్ రేట్ కొనసాగింది మరియు ఆల్ టైమ్ గరిష్ట రేటును నమోదు చేసింది. గోల్డ్ కోణాల్ని చూస్తున్న కస్టమర్లకు ఖేదాన్ని మరియు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన వారికి మోదాన్ని రుచి చూపిస్తోంది గోల్డ్ మార్కెట్.
ఈరోజు గోల్డ్ మార్కెట్ మొదలవుతూనే భారీగా పెరుగుధలను నమోదు చేసింది. గతవారం మొత్తం భారీగా పెరిగిన గోల్డ్ రేట్, ఈరోజు కూడా అదే దారిలో నడిచింది. ఇప్పటికే పసిడి కొనడానికి ఆలోచిస్తున్న పసిడి ప్రియులకు ఈరోజు రికార్డ్ అయిన గోల్డ్ రేట్ గొంతులో పడిన పచ్చి వెలక్కాయ మాదిరిగా మారింది.
గత వారం ప్రారంభంలో రూ. 66,700 రూపాయల వద్ద ప్రారంభమైన గోల్డ్ రేట్ వారం ముగిసే నాటికి రూ. 68,450 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది. అంటే, వారం మొత్తం మీద రూ. 1,750 కు పైగా గోల్డ్ రేట్ పెరిగింది. అయితే, ఈ ఒక్కరోజే బంగారం ధర రూ. 930 రూపాయల భారీ పెరుగుధలను నమోదు చేసింది. అందుకే, ఈరోజు గోల్డ్ మార్కెట్ రూ. 69,380 రూపాయల ఆల్ టైమ్ హైఎస్ట్ రేటును నమోదు చేసింది.
Also Read: ఎక్కడ పడితే అక్కడ Phone Charge ఛార్జ్ చేస్తున్నారా.. అయితే, ఈ New Scam గురించి తెలుసుకోండి.!
ప్రస్తుతం ప్రధాన మార్కెట్ లో కొనసాగుతున్న 24 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు గోల్డ్ రేట్ రూ. 68,459 వద్ద ప్రారంభమై రూ. 930 పెరిగి రూ. 69,380 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇది గోల్డ్ మార్కెట్ చూడని ఎన్నడూ చూడని ఆల్ టైమ్ గరిష్ట ధర.
ఇక 22క్యారెట్ గోల్డ్ లైవ్ రేట్ ను పరిశీలిస్తే, ఈరోజు ఉదయం రూ. 62,750 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్, రూ. 63,600 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 850 రూపాయల పెరుగుధలను నమోదు చేసింది.
వాస్తవానికి, గోల్డ్ రేట్ 70 వేల రూపాయలను తాకుందని నిపుణులు ముందే అంచనా వేసి చెప్పారు. ఇప్పుడు నిపుణుల అంచనా ఎట్టకేలకు నిజమయ్యింది. అయితే, ఈ రేటు ఇంతటితో ఆగదని, గోల్డ్ రేట్ మరింతగా పెరుగుతుందని కూడా కొత్త అంచనా లను వెల్లడించారు. చూడాలి గోల్డ్ రేట్ ఎక్కడ వరకూ వెళుతుందో.