రికార్డ్ ధరను హిట్ చేసిన బంగారం..ఈరోజు తులం ఎంతంటే.!
బంగారం ధర ఊహించని రీతిగా పెరుగుతోంది
గోల్డ్ మార్కెట్ ఈరోజు ఆల్ టైమ్ హైయెస్ట్ రేట్ ను హిట్ చేసింది
ఇన్వెస్టర్లకు లాభాల పంట చూపిస్తున్న గోల్డ్ మార్కెట్
బంగారం ధర ఊహించని రీతిగా పెరుగుతోంది మరియు ఈరోజు ఆల్ టైమ్ హైయెస్ట్ రేట్ ను హిట్ చేసింది. ప్రస్తుతం, గోల్డ్ మార్కెట్ ఎన్నడూ చూడని విధంగా భారీ పెరుగుదలను చూస్తోంది. గోల్డ్ మార్కెట్ లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వారికి లాభాల బాటను చూపిస్తున్న గోల్డ్ మార్కెట్, కొనాలని ఆలోచిస్తున్న వారికి మాత్రం అందని ద్రాక్షలా కనిపిస్తోంది. ఈరోజు గోల్డ్ మార్కెట్ ప్రైస్ అప్డేట్ మరియు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో బంగారం ధర వివరాలు ఈ క్రింద చూడవచ్చు.
Gold Price Update:
ఈరోజు బంగారం ధర భారీగానే పెరుగుదలను నమోదు చేసింది. ఈరోజు ప్రధాన మార్కెట్ లో 61,200 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ 600 రూపాయల పెరుగుదలను చూసి 61,800 వద్ద కొనసాగుతోంది. అలాగే, 56,100 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ 550 రూపాయల పెరుగుదలను చూసి 56,650 రూపాయల వద్ద ముగిసింది.
ఈ వారం గోల్డ్ రేట్ అప్డేట్
ఈ వారం ప్రారంభంలో సోమవారం 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ 55,400 రూపాయల వద్ద ప్రారంభమై ఈరోజు 56,650 వద్ద కొనసాగుతోంది. అంటే, కేవలం 5 రోజుల్లో తులం 22K గోల్డ్ రేట్ 1,250 రూపాయలు పెరిగింది. ఇక 24K గోల్డ్ విషయానికి వస్తే, 5 రోజుల్లో 1,370 రూపాయలు పెరిగి రూ.61,800 రూపాయల వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్
ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్ ను చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22K గోల్డ్ ధర 56,650 గా ఉండగా 10 గ్రాముల 22K గోల్డ్ ధర 61,800 గా వుంది. విజయవాడలో కూడా 10 గ్రాముల 22K గోల్డ్ ధర 56,650 గా ఉండగా 10 గ్రాముల 22K గోల్డ్ ధర 61,800 గా వుంది.