Gold Rate: దిగొచ్చిన బంగారం ధర..ఈరోజు తులం ఎంతంటే..!

Gold Rate: దిగొచ్చిన బంగారం ధర..ఈరోజు తులం ఎంతంటే..!
HIGHLIGHTS

Gold Rate: గోల్డ్ మార్కెట్ మరొకసారి క్రిందకు దిగజారింది

గడిచిన రెండు రోజుల్లో 500 రూపాయలకు పైగా క్రిందకు దిగజారింది

డాలర్ తో రూపాయి మారకం విలువ గోల్డ్ మార్కెట్ ను క్రిందకు దిగేలా చేస్తోంది

Gold Rate: గోల్డ్ మార్కెట్ మరొకసారి క్రిందకు దిగజారింది. గత వారం 51,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగిన బంగారం ధర గడిచిన రెండు రోజుల్లో 500 రూపాయలకు పైగా క్రిందకు దిగజారింది. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ ను అనుకరిస్తూ గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతున్నా డాలర్ తో రూపాయి మారకం విలువ గోల్డ్ మార్కెట్ ను క్రిందకు దిగేలా చేస్తోంది. అయితే, మొత్తానికి పసిడి ప్రియులకు మాత్రం గోల్డ్ మార్కెట్ ఆశాజనకంగానే కొనసాగుతోంది. ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎలా ఉన్నదో తెలుసుకోండి.              

Gold Rate:

అక్టోబర్ 28 న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,100 రూపాయలుగా ఉండగా, గడిచిన రెండు రోజుల్లో స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధర 46,600 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,840 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,840 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,840 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.50,990 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,440 గా ఉంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo