Gold Price Update: మార్కెట్ లో స్థిరంగా బంగారం ధర.!
గత వారం మొత్తం భారీగా పెరిగిన గోల్డ్ మార్కెట్
గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది
60 వేల మార్క్ క్రిందకు దిగువన గోల్డ్ మార్కెట్
గత వారం మొత్తం భారీగా పెరిగిన గోల్డ్ మార్కెట్, ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. అంతేకాదు, మొన్నటి వరకూ 60 వేల వద్ద కొనసాగుతున్న గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం 59 వేల రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఇప్పటికీ బంగారం ధర ప్రియంగానే ఉందనే చెప్పాలి. కానీ, మార్కెట్ నిపుణులు 2023 ప్రారంభం నుండే గోల్డ్ మార్కెట్ భారీ పెరుగుదలను చూడవచ్చని అంచనా వేసి చెబుతున్న విషయం తెలిసిందే. మరి ఈరోజు బంగారం ధర ఎలా ఉన్నదో చూద్దామా.
Gold update:
ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.54,850 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.140 రూపాయలు క్రిందకు దిగి రూ.54,7100 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.59,840 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.59,690 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈరోజు బంగారం ధర రూ.150 రూపాయలు క్రిందకు దిగినట్లు మనం చూడవచ్చు.
ఈరోజు బంగారం ధర
తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,710 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,690 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,710 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,690 గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.59,880 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,880 గా ఉంది.
సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.