Gold Price Update: ఈరోజు నిలకడగా బంగారం ధర.!

Updated on 30-Jan-2023
HIGHLIGHTS

ఈరోజు నిలకడగా కొనసాగుతున్న బంగారం ధర

గోల్డ్ రేట్ గత రెండు రోజుల నుండి నిలకడగా కొనసాగుతోంది

లేటెస్ట్ గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఏమిటో తెలుసుకోండి

Gold Price Update: ఈరోజు నిలకడగా కొనసాగుతున్న బంగారం ధర. గత వారంలో ఒకరోజు పెరిగితే ఒకరోజు క్రిందకు దిగిన గోల్డ్ రేట్ గత రెండు రోజుల నుండి నిలకడగా కొనసాగుతోంది. అయితే, ఈరోజు మార్కెట్ లో బంగారం వారం రోజులు క్రితం ఇదే రోజున ఉన్న ధరలోనే కొనసాగుతోంది. మరి ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎంత ఉన్నది మరియు లేటెస్ట్ గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఏమిటో తెలుసుకోండి. 

Gold Price Update

శుక్రవారం ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,500 రూపాయలుగా ఉండగా, శనివారం 15 రూపాయలు పెరిగి రూ.52,650 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,270 నుండి 170 రూపాయలు పెరిగి  రూ.57,440 రూపాయల వద్ద కొనసాగుతోంది. శనివారం నుండి గోల్డ్ స్థిరంగా ఉండడంతో అదే రేటుతో కొనసాగుతోంది.   

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,440 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,440 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,590 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,370 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :