Gold Price: ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా ఉందంటే.!

Gold Price: ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా ఉందంటే.!
HIGHLIGHTS

ఈరోజు గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది

గోల్డ్ రేట్ కొనుగోలుదారులను ఆకర్షించే విదంగానే వుంది

ఈ నెల పసిడి ప్రియులకు అనుకూలంగానే కనిపిస్తోంది

ఈరోజు గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్ లో గోల్డ్ రేట్ కొనుగోలుదారులను ఆకర్షించే విదంగానే వుంది. ఈ నెల పసిడి ప్రియులకు అనుకూలంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 50 వేల రూపాయల చుట్టూనే తిరుగుతోంది. గత వారం 52 వేల రూపాయల మార్కును చేరుకున్న గోల్డ్ రేట్ మెల్ల మెల్లగా క్రిందకు దిగింది. దీపావళి పండుగ సమయానికి ఈ రేటులో హెచ్చుతగ్గులు జరగవచ్చు. మరి ఈరోజు బంగారం ధర ఎలా కొనసాగుతుందో చూడండి.

 Gold Price:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,450 రూపాయలుగా ఉండగా, ఈరోజు కూడా స్థిరంగా నిలబడిన గోల్డ్ మార్కెట్ 46,420 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,640 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,420 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,640 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,420 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,650 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,410 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.50,620 గా ఉంది. ఈరోజు కూడా   దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,310 గా ఉంది

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo