దీపావళి మరియు దంతేరస్ పండుగలు ముందున్నా మార్కెట్ లో వెలవెల బోతున్న బంగారం ధర. ఇప్పటికే 8 నెలల కనిష్ఠానికి చేరుకున్న బంగారం ధర మరింత క్రిందకు దిగజారేలా కనిపిస్తోంది. అంతేకాదు, ఈరోజు కూడా బంగారం ధర డౌన్ ట్రెండ్ ఫాలో అయ్యింది. ఒక్కసారిగా గోల్డ్ మార్కెట్ పడిపోకపోయినా, ప్రతిరోజూ కొంచెం కొంచెంగా క్రిందకు దిగుతోంది. మొత్తంగా లెక్కిస్తే ఈ నెలలో దాదాపుగా గ్రాముకు 200 రూపాయలకు పైగా బంగారం ధర క్రిందకు దిగజారింది. ఇక దంతేరస్ పండుగ సందర్భంగా గోల్డ్ కొనాలని చూసేవారికి ఆశాజనకంగానే గోల్డ్ మార్కెట్ కొనసాగుతోంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దామా.
నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,250 రూపాయలుగా ఉండగా, ఈరోజు స్వల్పంగా తగ్గిన గోల్డ్ మార్కెట్ 46,250 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,450 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,450 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,260 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,460 గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,240 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.50,450 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,900 గా ఉంది.