Gold Price: స్థిరంగా గోల్డ్ మార్కెట్..ఈరోజు రేటు తెలుసుకోండి.!

Updated on 13-Oct-2022
HIGHLIGHTS

మూడు రోజులుగా క్రిందకు దిగజారుతూ వచ్చిన గోల్డ్ రేట్

ఈ మూడు రోజుల్లో తులానికి 1200 రూపాయలకు పైగా తగ్గింది

Gold Price ఈరోజు నిలకడగా కొనసాగుతోంది

Gold Price: మూడు రోజులుగా క్రిందకు దిగజారుతూ వచ్చిన గోల్డ్ రేట్, ఈరోజు నిలకడగా కొనసాగుతోంది. ఈ వారం ప్రారంభం నుండి నిన్నటి వరకూ కూడా బంగారం ధర డౌన్ ట్రెండ్ ను ఫాలో అయ్యింది. ఈ మూడు రోజుల్లో తులానికి 1200 రూపాయలకు పైగా తగ్గింది. అయితే, ఈరోజు తులానికి 100 రూపాయల మార్పుతో స్థిరంగా కొనసాగుతోంది. మరి ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎలా కొనసాగుతోందో తెలుసుకుందామా.       

Gold Price:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,650 రూపాయలుగా ఉండగా, ఈరోజు 100 రూపాయలు పెరిగి 46,750 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,100 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,000 గా ఉంది. ఈరోజు కూడా   దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 గా ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :