GOLD: భారీగా దిగజారి స్థిరపడిన బంగారం.!

Updated on 14-Oct-2022
HIGHLIGHTS

బంగారం ధర అక్టోబర్ నెల ప్రారంభమ నుండి ఒడిదిడుకులను ఎదుర్కొంది

4 రోజులు మొత్తం కూడా బంగారం ధర డౌన్ ట్రెండ్ ను ఫాలో అయ్యింది

గత రెండురోజులుగా మార్కెట్ లో Gold Rate స్థిరంగా కొనసాగుతోంది

GOLD: భారీగా దిగజారి స్థిరపడిన బంగారం. బంగారం ధర అక్టోబర్ నెల ప్రారంభమ నుండి ఒడిదిడుకులను ఎదుర్కొంది. అయితే, గత వారం దాదాపుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధర, ఈ వారం ప్రారంభం నుండి క్రిందకు దిగిజారగడం మొదలుపెట్టింది. వారంలో 4 రోజులు మొత్తం కూడా బంగారం ధర డౌన్ ట్రెండ్ ను ఫాలో అయ్యింది. అయితే, నిన్నటి నుండి గోల్డ్ మార్కెట్ ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. అయితే, గత వారం తో పోలిస్తే, తులానికి 1,300 రూపాయలకు పైగా క్రిందకు దిగజారింది. అయితే, గత రెండురోజులుగా మార్కెట్ లో గోల్డ్ రేట్ స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజు గోల్డ్ మార్కెట్లో ఎలా కొనసాగుతోందో పరిశీలిద్దాం.      

Gold:

గత వారం ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,850 రూపాయలుగా ఉండగా, నిన్నటి వరకూ 1,100 రూపాయలు తగ్గి 46,750 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,100 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,000 గా ఉంది. ఈరోజు కూడా   దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 గా ఉంది.      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :