జి మెయిల్ లో మీరు ఎవరికైనా తప్పుగా మెయిల్ పంపారా? అయితే ఇక నుండి దీనికి జి- మెయిల్ అఫిషియల్ గా undo ఆప్షన్ ను ప్రవేశ పెట్టింది. అంటే మీరు పంపిన మెయిల్ ను తిరిగి వెనక్కి తెచ్చుకోగలరు.
జి-మెయిల్ ల్యాబ్స్ లో గత 6 సంవత్సరాలుగా ఉన్న ఈ UNDO ఫీచర్ ను ఇప్పుడు గూగల్ అఫిషియల్ గా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. మీరు మెయిల్ పంపినప్పుడు, ఇక మీదట జి- మెయిల్ లో స్క్రీన్ పైన Undo ఆప్షన్ కనిపిస్తుంది. మీకు ఆ మెయిల్ వెళ్లకూడదు అనిపిస్తే దానిపై క్లిక్ చేస్తే మెయిల్ తిరిగి వెనక్కి వస్తుంది, అంటే వాళ్లకి చేరదు.
మీరు 5 సెకండ్స్ నుండి 30 సెకండ్స్ లోపు మెయిల్ వెళ్ళాలని ముందు సెట్ చేసుకుంటే, ఆ టైమ్ ఫ్రేమ్ లో కనుక undo లింక్ పై క్లిక్ చేసినట్లు అయితే, పంపిన మెయిల్ సర్వర్స్ నుండి వెనక్కు వస్తుంది.
దీనిని ఎనేబుల్ చేసుకోవటానికి జి మెయిల్ టాప్ స్క్రీన్ లో రైట్ సైడ్ గేర్ సింబల్ బటన్ పై క్లిక్ చేయగానే, క్రింద సెట్టింగ్స్ డ్రాప్ డౌన్ బటన్ వస్తుంది, దానిలో Settings అనే ఆప్షన్ పై క్లిక్ చేసి క్రింద కు స్క్రోల్ చేస్తే undo send ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోగలరు. అక్కడే టైమ్ పిరియడ్ ఆప్షన్ కూడా సెట్ చేయగలరు.