తాజాగా జి మెయిల్ 6 సంవత్సరాలుగా బీటా లాబ్స్ లో ఉన్న జి మెయిల్ "Undo Sent" ఆప్షన్ ను అఫీషియల్ చేసి, అందరికీ అందుబాటులో తెచ్చింది. దిని గురించి మనం ఇంతకముందు చెప్పుకున్నాం. అది చూడని వారు ఈ లింక్ లో దీని గురించి అధిక సమాచారం తెలుసుకోగలరు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్, ఎప్పుడైనా బై మిస్టేక్ గా మెయిల్ ను సెండ్ చేసినప్పుడు, దానిని వెళ్లకుండా ఆపివేయటానికి "Undo Sent" ఫీచర్ ఉపయోగపడుతుంది.
అయితే ఇప్పుడు మళ్ళీ Gmail లో తాజగా కొత్త అప్డేట్ వచ్చింది. ఇది కొత్తగా జి మెయిల్ ను చూసే అవకాశం కలిపిస్తుంది. మీరు యాహూ మెయిల్ ను చూసినట్లు అయితే, ఇప్పుడు జిమెయిల్ కూడా అలానే ఉండనుంది. "Split Mode" పేరుతో మీ జిమెయిల్ విండో లో టాప్ రైట్ కార్నర్ లో Settings సింబల్ పక్కన లెఫ్ట్ సైడ్ దీనిని ఏక్సిస్ చేయగలరు. ఇది అప్డేట్ వచ్చిన వారికీ మాత్రమే కనిపించవచ్చు.
సాధారణంగా ఇప్పటి వరకూ మీ మెయిల్స్ అన్నీ దేనికి దానిలో చూడటానికి అవుతుంది. అయితే ఇప్పుడు స్ప్లిట్ మోడ్ ద్వారా మీరు ఒక మెయిల్ పై క్లిక్ చేసిన వెంటనే దాని పక్కన వర్టికల్ గా కాని, క్రిందన హారిజంటల్ గా కాని సెపరేట్ గా చూపించబడుతుంది ఓపెన్ చేయబడిన మెయిల్. ఒక పక్క మెయిల్స్ అన్ని ఉంటే మరో పక్క మీరు ఓపెన్ చేసిన మెయిల్ మాత్రమే ఉంటుంది. ఇది నచ్చకపోతే "No Split" మీద సెలెక్ట్ చేసుకుంటే, మీ పాత జి మెయిల్ లుక్ లోకి వెళిపోతుంది విండో. ఇది డెస్క్ టాప్ పై మాత్రమే పనిచేస్తుంది. మొబైల్ యాప్ లో లేదు. టాబ్లెట్స్ లో కూడా ఈ ఫీచర్ ఉండే అవకాశాలు ఉన్నాయి.