1GB per సెకెండ్ స్పీడ్ తో రిలయన్స్ Jio GIGA FTTH బ్రాండ్ బాండ్ ఇంటర్నెట్

Updated on 07-Dec-2016

రిలయన్స్ Jio నుండి బ్రాండ్ బాండ్ సర్వీసెస్ వస్తున్నాయి. అంటే ఇంటికి WiFi ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవటానికి. స్మార్ట్ ఫోన్ టెలికాం Jio 4G  లానే ఇది కూడా కొత్త టెక్నాలజీ తో వస్తుంది.

FTTH(Fiber To The Home) wired బ్రాడ్ బాండ్ సర్వీస్ తో వస్తున్న దీని పేరు రిలయన్స్ Jio GigaFiber. Fibre నెట్ వర్క్ కలిగి ఉంటాయి. అంటే ఇప్పటి వరకూ లేని సూపర్ స్పీడ్స్… 700MBPS నుండి 1GBPS రేంజ్ లో ఉంటుంది ఈ ఫైబర్ బ్రాండ్ బాండ్ స్పీడ్.

ఆల్రెడీ Jio GigaFiber FTTH ట్రయిల్ ఆఫర్ ను వాడుతున్న వ్యక్తీ ఒకరు దీని స్పీడ్స్ కు సంబంధించి ఒక tweet కూడా చేశారు. క్రింద చూడగలరు.

https://twitter.com/arjunhemrajani/status/772433270126641153

స్మార్ట్ ఫోన్స్ లో అయితే, Jio 4G మాక్సిమమ్ ఎవరేజ్ గా 20 నుండి 50MBPS స్పీడ్ అందిస్తుంది. ఆల్రెడీ ముంబై మరియు పూణే సిటీస్ లో GigaFiber టెస్టింగ్ నిర్వహిస్తుంది కంపెని.

తొందరిలోనే మరొక 100 సిటీస్ కు ఈ నెట్ వర్క్ అందించనున్నట్లు తెలుస్తుంది. దీనికి కూడా కంపెని ప్రివ్యూ ఆఫర్ లాంటిది అందిస్తుంది అని రిపోర్ట్స్.

అయితే ఇది కేవలం fibre వైర్ నెట్ వర్క్ లను అమర్చిన సిటీస్ లోనే అందుబాటులో ఉంటుంది.  ఈ gigafiber బ్రాండ్ బ్యాండ్ నెట్ వర్క్ లో మరి ప్లాన్స్ ఏలా ఉండనున్నాయని అనేది కొంత ఆశక్తి ని క్రియేట్ చేస్తుంది.

ఏ సిటీస్ లో ఉంటుంది. ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయి ఎంత స్పీడ్ వస్తుంది వంటి సమాచారాన్ని కంపెని వెల్లడించినప్పుడు మీకు ఆ సమాచారాన్ని తెలియజేయగలము. 

Jio పై మీకు ఉండే కంప్లీట్ డౌట్స్ ను ఈ లింక్  లో క్లియర్ చేయటం జరిగింది.

కోడ్ ఎవరికీ అవసరం, ఎవరికీ అవసరం లేదు అనే విషయాలు ఈ లింక్ లో తెలుసుకోండి.

Jio సిమ్ ను సెప్టెంబర్ 5 నుండి ఈ లింక్ లో తీసుకోండి.

Jio సిమ్ కొరకు కోడ్ జెనరేటింగ్ ఈ లింక్  లో మాదిరిగా చేయండి.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :