GibiliStyle hashtag and trend effect x platform gone down
X Down: GibiliStyle ట్రెండ్ తో గత వారం రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మోత మోగుతున్నాయి. Chat GPT 40 అప్డేట్ తో అందించిన కొత్త ఫీచర్ తో AI అందించిన కార్టూన్ లేదా యానిమేటెడ్ ఇమేజ్ లు నెట్టింట్లో పోస్ట్ చేస్తూ కొత్త రకం ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. ఇంకేముంది, ఏదైనా ఒకరు చేస్తే చాలు మేమేమన్నా తక్కువా అంటూ మిగిలిన అందరూ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హాల్ చేస్తుంటారు. అయితే, ఈ ట్రెండ్ అతిగా ఫాలో అవ్వడం మరియు విపరీతంగా వైరల్ కావడం ఆ ప్లాట్ ఫామ్ సర్వర్లకు లేని పోనీ భారాన్ని తెచ్చి పెడుతుంది. ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే జరిగింది. గిబిలీ స్టైల్ పోర్ట్రైట్ ఫోటోలతో X అకౌంట్ లో సాగిన ట్రెండ్ మరియు హ్యాష్ ట్యాగ్ పర్వం దెబ్బకు ఇప్పుడు ఎలాన్ మస్క్ X (ఒకప్పుడు ట్విట్టర్) ప్లాట్ ఫామ్ డౌన్ అయ్యింది.
ఈరోజు రాత్రి 8 గంటల నుంచి X ప్లాట్ ఫామ్ డౌన్ అయినట్లు యూజర్లు చెబుతున్నారు. సర్వీస్ మరియు నెట్వర్క్ డౌన్ అప్డేట్స్ అందించే ప్లాట్ ఫామ్ Downdetector ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే చాలా మంది యూజర్లు ఈ ప్లాట్ ఫామ్ డౌన్ అయిన విషయాన్ని నివేదించారు. ఈ విషయం పై రిపోర్ట్ చేసిన యూజర్లలో 58% మంది యూజర్లు యాప్ లో అంతరాయం చూస్తున్నట్లు రిపోర్ట్ చేయగా, 28% మంది యూజర్లు వెబ్సైట్ లో అంతరాయం చూసినట్లు రిపోర్ట్ చేశారు. అయితే, 14% మంది మాత్రం సర్వర్ ఇష్యు చూసినట్లు రిపోర్ట్ చేశారు.
Also Read: Ugadi Tv Deal: భారీ డిస్కౌంట్ తో 22 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ QLED Smart tv