Gemini Live: తెలుగు తో సహా మొత్తం 9 భాషల్లో అందుబాటులోకి వచ్చిన జెమినీ లైవ్.!

Gemini Live: తెలుగు తో సహా మొత్తం 9 భాషల్లో అందుబాటులోకి వచ్చిన జెమినీ లైవ్.!
HIGHLIGHTS

Gemini Live ఇప్పుడు తెలుగు తో సహా 9 భాషల్లో అందుబాటులోకి వచ్చింది

Google For India కార్యక్రమం ద్వారా ఈ జెమినీ లైవ్ ని 9 భాషల్లో విడుదల చేసింది

గూగుల్ యొక్క ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్

Gemini Live: గూగుల్ యొక్క ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ జెమినీ లైవ్ ఇప్పుడు తెలుగు తో సహా 9 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ నిర్వహించిన ‘Google For India’ కార్యక్రమం ద్వారా ఈ జెమినీ లైవ్ ని 9 భాషల్లో విడుదల చేసింది. ఇండియాలో ఆగస్టు 8 న కేవలం ఇంగ్లీషు భాషలో మాత్రమే లాంచ్ చేసిన గూగుల్ లైవ్ ఇప్పుడు ఏకంగా 9 ఇండియా ప్రధాన భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

Gemini Live

ఈరోజు గూగుల్ నిర్వహించిన గూగుల్ ఫర్ ఇండియా ప్రోగ్రాం నుంచి ఈ కొత్త ప్రకటన అనౌన్స్ చేసింది. ఏదైనా విషయాన్ని చర్చించడానికి లేదా ఇన్ఫర్మేషన్ ను నేరుగా వాయిస్ కమాండ్స్ ద్వారా జెమినీ లైవ్ ద్వారా పొందవచ్చు. ముందుగా పైన తెలిపిన విధంగా జెమినీ లైవ్ ఆగస్టు 8 న కేవలం ఇంగ్లీషు భాషలో మాత్రమే ఇండియాలో అడుగుపెట్టింది. అయితే, ఈరోజు నుంచి సర్వీస్ తెలుగు తో సహా మొత్తం 9 భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

Gemini Live

ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమం నుంచి గూగుల్ లైవ్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలీ, గుజరాత్, మరాఠీ మరియు ఉర్దూ భాషల్లో ఉపలబ్దం అవుతుందని ప్రకటించింది. గూగుల్ యొక్క ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఇండియాలో 40% కి పైగా యూజర్లు వాయిస్ ఇంటరాక్షన్స్ పైనే ఆధారపడుతున్నారు. అందుకే, ఈ కొత్త అప్డేట్ అధిక శాతం యూజర్లకు గొప్పగా ఉపయోగపడుతుందని గూగుల్ ఈ కార్యక్రమం ద్వారా తెలిపింది.

Also Read: Power House: చవక ధరలో 50,000mAh పవర్ ఫుల్ పవర్ బ్యాంక్ లాంచ్ చేసిన UNIX

ముఖ్యంగా, ఇతర దేశాలతో పోలిస్తే AI అమలు మరియు వినియోగం భారత దేశంలో అధికంగా ఉన్నట్లు ఈ కార్యక్రమం ద్వారా గూగుల్ తెలిపింది. అంతేకాదు, త్వరలోనే వీడియో రికార్డ్ చేసి దానికి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవచ్చని గూగుల్ తెలిపింది. గూగుల్ లెన్స్ పైన ప్రెస్ చేసి వీడియో రికార్డ్ చేసి, తర్వాత దానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ త్వరలో వస్తుందని గూగుల్ ఈ ఈవెంట్ నుంచి అనౌన్స్ చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo