Aadhaar Update: ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే.!

Aadhaar Update: ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే.!
HIGHLIGHTS

ఉచిత Aadhaar Update డిసెంబర్ 14 తో ముగిసింది

ప్రభుత్వం ఈ ఉచిత ఆధార్ అప్డేట్ గడువు మళ్ళి పొడిగించింది

ఇప్పుడు కూడా ఎప్పటిలాగానే గడువు పొడిగించింది

Aadhaar Update కోసం ఉచిత అప్డేట్ అవకాశాన్ని చాలా కాలంగా UIDAI అందిస్తూనే ఉంది. అయితే, ఇటీవల ఈ ఉచిత ఆధార్ అప్డేట్ అవకాశం కేవలం డిసెంబర్ 14 వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని అనౌన్స్ చేసింది. వాస్తవానికి, ఈ డేట్ ను చాలా సార్లు పొడిగించింది మరియు ఇప్పుడు కూడా మరోసారి ఈ ఉచిత అప్డేట్ డేట్ ను పొడిగించింది.

Aadhaar Update:

ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు విధిగా వారి ఆధార్ ను అప్డేట్ చేయాలని కోరిన ప్రభుత్వం, వారి ఆధార్ అప్డేట్ కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కూడా వెల్లడించింది. అప్పటి నుంచి ఈ ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ ను అందించింది. 

అయితే, ఈ సర్వీస్ కొన్ని నెలల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఆ పరిమిత సమయంలో ఆధార్ హోల్డర్స్ వారి ఆధార్ ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, గడువు ముగిసిన ప్రతిసారీ ఈ ఉచిత ఆధార్ అప్డేట్ గడువును పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా ఎప్పటిలాగానే గడువు పొడిగించింది. 

కొత్త అప్డేట్ ప్రకారం, ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ గడువు 14 జూన్ 2025 వరకు పొడిగించింది. అంటే, 14 జూన్ 2025 ఆధార్ యూజర్లకు ఈ ఈ ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. 

Also Read: భారీ డిస్కౌంట్ తో 16 వేల బడ్జెట్ లో లభిస్తున్న బ్రాండెడ్ QLED Smart Tv.!

ఏ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు?

మీరు మీ ఆధార్ అడ్రస్ ను ఇందులో అప్డేట్ చేసుకోవచ్చు. మీ ఆధార్ లో ఉన్న అడ్రెస్స్ అప్డేట్ ను చేసుకోవడానికి ఈ ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ఆధార్ సెంటర్ కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మీ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ లలో మీరే సొంతంగా చేసుకోవచ్చు.

Aadhaar Update

దీనికోసం, myaadhaar uidai gov in వెబ్సైట్ ను ఓపెన్ చేసే మీ ఆధార్ మరియు మొబైల్ నెంబర్ పై వచ్చే OTP తో లాగిన్ అవ్వాలి. లాగిన అయిన తర్వాత డాక్యుమెంట్ అప్డేట్ ట్యాబ్ లోకి వెళ్లి అడ్రెస్ వివరాలు అందించాలి. అందించిన కొత్త అడ్రస్ వివరాలను సపోర్ట్ చేసే తగిన డాక్యుమెంట్ ఫైల్ ను అప్లోడ్ చేయాలి. ఈ వివరాలతో కొత్త ఆధార్, కొత్త అడ్రస్ కు అందుతుంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo