రిఫండ్ పేరుతో Myntra కి టోకరా: బెంగళూరు సిటీలో 1 కోటికి కొట్టేసిన స్కామర్లు.!
Myntra ని టార్గెట్ చేసుకొని కొంతమంది స్కామర్లు నిలువు దోపిడీ
రిఫండ్ కంప్లైంట్ ను ఆసరాగా చేసుకొని ఈ స్కామ్ చేసినట్లు చెబుతున్నారు
బెంగళూరు సిటీలో 1 కోటి రూపాయలకు పైగా స్కామ్
దేశంలో గొప్ప ఆన్లైన్ ఫ్యాషన్ రిటైలర్ గా చలామణి అవుతున్న Myntra ని టార్గెట్ చేసుకొని కొంతమంది స్కామర్లు నిలువు దోపిడీ చేశారు. కేవలం బెంగళూరు సిటీలో 1 కోటి రూపాయలకు పైగా స్కామ్ చేసినట్లు బయటపడటంతో బెంగళూరు పోలీసులకు మింత్రా యాజమాన్యం కంప్లైంట్ చేసినట్లు నివేదికలు తెలిపాయి. ప్రోడక్ట్స్ రీప్లేస్ మెంట్ మరియు రిఫండ్ వంటి కంప్లైంట్ ను ఆసరాగా చేసుకొని ఈ స్కామ్ చేసినట్లు చెబుతున్నారు.
Myntra
బ్రాండెడ్ బట్టలు, ఫ్యాషన్ మరియు కాస్మెటిక్స్ మంచి ఆఫర్ ధరకు అందిస్తున్న నమ్మకమైన ప్లాట్ ఫామ్ గా మింత్రా పేరు తెచ్చుకుంది. కస్టమర్ కు తగిన ప్రోడక్ట్ చేరకుంటే, వారి వద్ద నుంచి అందుకున్న కంప్లైంట్ ద్వారా వారికి తగిన సహాయాన్ని కూడా అందిస్తుంది. ఈ సర్వీస్ పరంగా కంపెనీ మంచి రేటింగ్ మరియు పేరు సంపాదించుకుంది. అయితే, స్కామర్లు ఈ గొప్ప సర్వీస్ ను వారి స్కామ్ లకు అడ్డాగా మార్చుకున్నారు.
అసలు ఈ స్కామ్ ఎలా చేశారు?
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెద్ద బ్రాండ్స్ యొక్క బూట్లు, బ్యాగులు మరియు కాస్మెటిక్స్ వంటి మరిన్ని ప్రొడక్ట్స్ ని బల్క్ లో ఎక్కువ ప్రొడక్ట్స్ ను ఆర్డర్ చేస్తారు. ఈ ఆర్డర్ కోసం ఆన్లైన్ లో ప్రీ పేమెంట్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ (CoD) ద్వారా చెల్లిస్తారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది.
తాము పెట్టిన బల్క్ ఆర్డర్ లో సగమే తమకు చేరాయని కంప్లైట్ సిస్టం ద్వారా మింత్రా ని ఆశ్రయిస్తారు. ఈ కంప్లైట్ అందుకున్న టీమ్ వారికి తగిన సొల్యూషన్ ను అందించే లోపుగా వారు వారి చెల్లించిన అమౌంట్ రిఫండ్ కావాలని రిక్వెస్ట్ చేసి, పూర్తి అమౌంట్ రిఫండ్ అందుకుంటారు. ఈ విధంగా స్కామ్ జరిగినట్లు మింత్రా గుర్తించింది.
Also Read: Lava Blaze Duo 5G: బడ్జెట్ డ్యూయల్ స్క్రీన్ ఫోన్ ప్రకటించిన లావా.!
స్కామ్ విషయం ఎలా బయట పడింది?
బెంగళూరు సిటీ మింత్రా లో జరిగిన అడిట్ లో దాదాపు 5,529 వరకు ఇటివంటి దొంగ ఆర్డర్స్ జరిగినట్లు కంపెనీ గుర్తించింది. ఇది కేవలం బెంగళూరు సిటీలో మాత్రమే కాదు చాలా మెట్రో సిటీల్లో జరిగినట్లు గుర్తించారు. ఇందులో జైపూర్ రెండవ స్థానంలో ఉన్నట్లు చెబుతున్నారు.
రాజస్థాన్ కి చెందిన ఒక గ్యాంగ్ ఈ స్కామ్ కి తెరలేపినట్లు చెబుతున్నారు. అంతేకాదు, ఇందులో ఎక్కువ ఆర్డర్స్ జైపూర్ నుంచే అందుకున్నట్లు గుర్తించారు. అయితే, ఈ విషయంలో ఘాటుగా స్పందించిన మింత్రా యాజమాన్యం ఈ స్కామ్ పై బెంగుళూరు పోలీసులకు కంప్లైంట్ చేశారు.