AI పెర్ఫార్మెన్స్ ప్రమాణాల కోసం Digit AI-Q స్కోరింగ్ సిస్టమ్ ను ప్రకటిస్తోంది.!
పరికరాల AI పెర్ఫార్మెన్స్ లెక్కించడానికి డిజిట్ నుండి మేము Digit AI-Q స్కోరింగ్ సిస్టమ్ ని రూపొందించాము
ప్రచురణ ఇండస్ట్రీలో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కోసం AI పెర్ఫార్మెన్స్ యొక్క మొదటి ప్రామాణిక కొలత ఇది సూచిస్తుంది
పరికరాల న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) లో నిర్వహించబడే 80 AI మరియు కంప్యూటర్ విజన్ టెస్ట్‌లను కలిగి ఉన్న విస్తృతమైన టెస్టింగ్ ప్రోసెస్ నుండి ఈ AI గణన తీసుకోబడింది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ నుండి మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా చాలా వేగంగా అభివృద్ధి చెందింది. స్మార్ట్ ఫోన్స్ రంగంలో ఈ పరివర్తన చాలా ముఖ్యమైనది. ఫోటోగ్రఫీని మెరుగుపరచడం మొదలుకొని వాయిస్ అసిస్టెంట్ లను ప్రారంభించడం మరియు ప్రిడిక్టివ్ టెక్స్ట్‌ను శక్తివంతం చేయడం వరకు, AI సామర్థ్యాలు యూజర్ అనుభవాన్ని ఎక్కువగా నిర్వచించాయి. స్మార్ట్ ఫోన్ లలో పెరుగుతున్న AI యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ, డిజిట్ నుండి మేము Digit AI-Q స్కోరింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసాము- ఇది డివైజ్ ల AI పెర్ఫార్మెన్స్ అంచనా వేయడానికి ఒక పద్ధతి.
ప్రచురణ ఇండస్ట్రీలో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కోసం AI పెర్ఫార్మెన్స్ యొక్క మొదటి ప్రామాణిక కొలత ఇది సూచిస్తుంది
Also Read: Motorola Razr 50 Ultra పెద్ద ఔటర్ డిస్ప్లేతో లాంచ్ అవుతోంది.!
ఈ సాంకేతిక పురోగతిపై వ్యాఖ్యానిస్తూ, టైమ్స్ నెట్‌వర్క్, ప్రెసిడెంట్ & COO – డిజిటల్, రోహిత్ చెడ్డా ఇలా అన్నారు, “మేము మా వ్యూహాత్మక వృద్ధి కార్యక్రమాలలో భాగంగా Digit ని కొనుగోలు చేసాము మరియు దానిని దాని తదుపరి దశ వృద్ధిలోకి నడిపేందుకు సిద్ధంగా ఉన్నాము. AI-Q నిజంగా మన కాలంలో తెచ్చిన అద్భుతమైన ఆవిష్కరణ మరియు టెక్నాలజీ ఇండస్ట్రీలో డిజిట్ యొక్క ఆలోచనా నాయకత్వాన్ని ప్రదర్శించే కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది. జెనరేటివ్ AI యొక్క పెరుగుదల మరియు అన్ని రకాల పరికరాలలో దాని ఏకీకరణతో, డిజిట్ వినియోగదారులకు వారి గాడ్జెట్స్ యొక్క నిజమైన AI సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి సరైన సహాయం చేస్తుంది. మా కఠినమైన బెంచ్‌మార్కింగ్ ప్రక్రియ, 80 మోడల్స్ మరియు AI పెర్ఫార్మెన్స్ యొక్క 180 కంటే ఎక్కువ అంశాలను కలిగి ఉంటుంది, ఇది వేగం, ఖచ్చితత్వం మరియు ప్రారంభ సమయం యొక్క సమగ్ర వివరాలు లెక్కగట్టి నిర్ధారిస్తుంది.
తెలియని వారి కోసం, Digit ని ఇటీవల టైమ్స్ నెట్‌వర్క్ కొనుగోలు చేసింది, దాని డిజిటల్ పబ్లిషింగ్ వ్యాపారంలో దాని నిరంతర పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది. ఇది ఇప్పటికే 110 మిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల వినియోగదారులను చేరుకుంది మరియు 1 బిలియన్ కంటే ఎక్కువ నెలవారీ వీడియో వ్యూస్ సంపాదించింది.
Digit AI-Q
డిజిట్ యొక్క AI-Q (AI కోషెంట్) అనేది స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్ లు మరియు టెలివిజన్ లతో సహా వివిధ పరికరాల AI సామర్థ్యాలను అంచనా వేసే యాజమాన్య స్కోరింగ్ సిస్టమ్. AI-Q స్కోర్ వినియోగదారులకు వారి గాడ్జెట్‌లలోని AI స్పెసిఫికేషన్‌ల గురించి స్పష్టమైన అవగాహనను అందిస్తుంది, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయపడుతుంది.
పరికరాల న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) లో నిర్వహించబడే 80 AI మరియు కంప్యూటర్ విజన్ టెస్ట్ లను కలిగి ఉన్న విస్తృతమైన టెస్టింగ్ ప్రోసెసింగ్ నుండి AI గణన తీసుకోబడింది. ఈ పరీక్షలు ఆబ్జెక్ట్ రికగ్నిషన్/క్లాసిఫికేషన్, సెమాంటిక్ సెగ్మెంటేషన్, పేర్లల్ ఆబ్జెక్ట్ రికగ్నిషన్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్, ఇమేజ్ & వీడియో ప్రాసెసింగ్, ఫేస్ రికగ్నిషన్, కెమెరా సీన్ డిటెక్షన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మరియు మరిన్ని వివిధ అంశాలను కవర్ చేస్తాయి.
కఠినమైన బెంచ్‌మార్కింగ్ ప్రక్రియ AI పెర్ఫార్మెన్స్ యొక్క 180 కి పైగా విభిన్న అంశాలు పరిశీలిస్తుంది. వీటిలో వేగం, ఖచ్చితత్వం మరియు ప్రారంభ సమయం, సమగ్ర మరియు సంపూర్ణ గణనలను నిర్ధారిస్తుంది.
తాజా సమాచారంతో వినియోగదారులను శక్తివంతం చేయడానికి మా నిరంతర ప్రయత్నంలో భాగంగా, మేము మా వెబ్‌సైట్‌లో కొత్త సెగ్మెంట్ అయిన Digi-AI-zed ని కూడా పరిచయం చేసాము. ఈ ప్రత్యేక విభాగం అన్ని AI- సంబంధిత వార్తలు మరియు రివ్యూల కోసం సమగ్ర మూలాధారంగా ఉపయోగపడుతుంది. AI టెక్నాలజీలో తాజా పురోగతులను కోరుకునే వినియోగదారులు మరియు పరిశ్రమల ప్రముఖులకు అందించబడుతుంది.