ఫ్లిప్ కార్ట్ కు 20 లక్షల రూ మోసం చేసిన హైదరాబాద బయర్.

Updated on 05-Oct-2015

హైదరాబాద్, వనస్థలిపురం కు చెందిన, వీరా స్వామీ అనే 32 ఏళ్ల వ్యక్తి ఫ్లిప్ కార్ట్ లో ఐటమ్స్ ను బుక్ చేసి, రిటర్న్ చేసి టోటల్ గా 20 లక్షల అమౌంట్ టోకరా వేశాడు.

ఒక పేరు తో కాకుండా ఇంట్లోని.. ఇంటి చుట్టుపక్కల వారి అందరి పేర్లతో పెద్ద పెద్ద ఎలెక్ట్రానిక్ ఐటమ్స్ ను బుక్ చేసేవాడు. ఐటమ్స్ డెలివర్ అయ్యాక, ఫ్లిప్ కార్ట్ కు కాల్ చేసి ఐటమ్స్ లో నాణ్యత లేదని చెప్పి రిటర్న్స్ అప్లై చేసేవాడు మళ్ళీ.

ఫ్లిప్ కార్ట్ ఐటెం రిటర్స్ కు ఒప్పుకున్నాక, ఐటెం తీసుకువెళ్లటానికి పిక్ అప్ బాయ్స్ వచ్చినప్పుడు ఐటెం బాక్స్ లో అసలు వస్తువు కాకుండా వేరే వేస్ట్ stuff ను పెట్టి ప్యాక్ చేసి రిటర్న్ చేసేవాడు. బాక్స్ పై అసలు మోడల్ నంబర్ మరియు ఐటెం కోడ్ వ్రాయటం వలన చెకింగ్ జరిగేది కాదు.

ఐటెం పేమెంట్స్ కూడా డిఫరెంట్ ఈమెయిల్ id లతో డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ తో చేసేవాడు. సో రిటర్స్ గూడ్స్ ఫ్లిప్ కార్ట్ కు చేరగానే, మనీ ఆటోమేటిక్ గా రిఫండ్ అయిపోయేది.

ఇలా మొత్తం 200 ఐటమ్స్ ను 20 నెలల వ్యవధి లో purchase చేసాడంట ఈ వ్యక్తీ. దాని వలన కంపెని కు సడెన్ గా ఇంత హై ఎమౌంట్ లో లాస్ రావటం గమనిస్తే.. ఈ విషయం బయట పడింది. దానితో హైదరాబాద్ ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం పోలిస్ కంప్లైంట్ చేయటంతో ప్రస్తుతం కేస్ పై విచారిస్తున్నారని వెల్లడించారు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :