Flipkart Big Billion days sale నుండి ఈ ప్రోడక్ట్స్ పైన 80% డిస్కౌంట్ అఫర్ చేస్తుందట.!

Updated on 08-Sep-2022
HIGHLIGHTS

Flipkart Big Billion days 2022 sale ను ప్రకటించింది

అతి భారీ డిస్కౌంట్ అఫర్ చేయబోతున్నట్లు టీజింగ్ కూడా మొదలు పెట్టింది

కొన్ని ప్రోడక్ట్స్ పైన 80% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు టీజర్ ద్వారా చెబుతోంది

పండుగ సీజన్ ఆన్లైన్లో లో కనిపిస్తోంది మరియు ఫ్లిప్ కార్ట్ కూడా దానికి అనుగుణంగా Flipkart Big Billion days sale ను ప్రకటించింది. ఈ అప్ కమింగ్ సేల్ నుండి భారీ నుండి అతి భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లను కూడా అఫర్ చేయబోతున్నట్లు టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఇప్పటికే తన ఆన్లైన్ ప్లాట్ఫామ్ పైన అందించిన బ్యానర్ పేజ్ మరియు మైక్రో సైట్ పేజ్ ద్వారా కొన్ని డీల్స్ వివరాలను అందించింది. Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి కొన్ని ప్రోడక్ట్స్ పైన 80% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు టీజర్ ద్వారా చెబుతోంది. మరి ఆ ప్రొడక్స్ ఏమిటో, యెటర్ ప్రోడక్ట్స్ పైన ఎటువంటి ఆఫర్లను ఇవ్వనున్నదో ఒక లుక్ వేద్దాం.

వాస్తవానికి, Flipkart అప్ కమింగ్ సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ యొక్క డేట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే, ఏ కేటగిరి ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా ఎంత వరకూ డిస్కౌంట్ అఫర్ చెయ్యనున్నది, అనే విషయాన్ని మాత్రం మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. దీని ప్రకారం, TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) పైన గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్ అందించే అవకాశం వుంది. అలాగే, ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పైన కూడా గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు చెబుతోంది. మొబైల్ ఫోన్ల పైన కూడా గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను కూడా ప్రకటించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. అంటే, ఈ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్ లను మంచి డిస్కౌంట్ ధరకే పొందే వీలుంటుందని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ ద్వారా తెలుస్తోంది.

అలాగే, ఎప్పటిలాగానే స్పెషల్ లాంచ్, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ ని Axis మరియు ICICI యొక్క భాగస్వామ్యంతో తీసుకొస్తోంది కాబట్టి, ఈ రెండు బ్యాంక్స్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా వస్తువులను కొనేవారికి అధనపు తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. అదేవిధంగా, ఫ్లిప్ కార్ట్ పే లేటర్, ఇన్స్టాంట్ క్రెడిట్ మరియు సులభమైన ఈజీ EMI అప్షన్ ను కూడా అఫర్ చేస్తోంది . ఈ సేల్ త్వరలో రానున్నట్లు టీజ్ చేస్తున్న Flipkart, ఇంకా తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే, త్వరలోనే తేదీని కూడా వెల్లడించవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :