Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుండి పారంభమవుతుండగా, Flipkart ఇప్పటి నుండే గొప్ప ఆఫర్లను ప్రకటిస్తోంది. ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ ను చాలా తక్కువ ధరకే పొందే వీలుంది. ఇక ప్రస్తుతం ఫ్లయ్ కార్ట్ అఫర్ చేస్తున్న బెస్ట్ అఫర్ విషయానికి వస్తే, Samsung Galaxy F13 5G స్మార్ట్ ఫోన్ పైన భారీ డీల్ ను అఫర్ చేస్తోంది. శామ్సంగ్ తెచ్చిన ఈ లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ మరింత చవక ధరకే ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను అఫర్ ద్వారా కేవలం 10,999 రూపాయల ధరలో పొందే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. మరి ఆ అఫర్ ఏమిటో తెలుసుకుందామా.
శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్టార్టింగ్ వేరియంట్ 4జీబీ మరియు 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ను ఈరోజు కేవలం రూ.12,499 ధరతో లభిస్తోంది. ఈ ఫోన్ ను Axis మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనే వారికి 1,500 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, అన్ని ఆఫర్లను కలిపితే ఈ ఫోన్ ను కేవలం రూ.10,999 రూపాయల ధరలో పొందవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ F23 5G స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల FHD+ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 750G 5G చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది మరియు One UI 4.1 సాఫ్ట్ వేర్ తో వుంటుంది.
కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 50ఎంపీ మైన్ కెమెరాకి జతగా 8ఎంపి అల్ట్రా వైడ్ డెప్త్ మరియు 2ఎంపీ డెప్త్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 8ఎంపీ సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ బాక్స్ తో పాటుగా ఛార్జర్ ను మాత్రం శామ్సంగ్ అందించదు.