Flipkart: కస్టమర్లకు షాకిచ్చిన ఫ్లిప్ కార్ట్..!!

Updated on 30-Oct-2022
HIGHLIGHTS

ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం Flipkart తన కస్టమర్లకు కస్టమర్లకు పిడుగులాంటి వార్త వెల్లడించింది. ఇప్పటి వరకూ నామమాత్రపు హ్యాండ్లింగ్ ఫీజులను మాత్రమే వసూలు చేస్తున్న ఫ్లిప్ కార్ట్ ఇకపై అదనపు ఛార్జ్ లను వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఈ వార్తను ప్రత్యేకంగా వెల్లడించక పోయినా ఫ్లిప్ కార్ట్ యొక్క వెబ్సైట్ మరియు యాప్ నుండి ఈ విషయాన్ని చూపించింది. అయితే, కొత్తగా విధించనున్న హ్యాండ్లింగ్ ఫీజులను కేవలం క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ పైన మాత్రమే విధించనున్నట్టు చెబుతోంది.

ఇక ఫ్లిప్ కార్ట్ తీసుకొస్తున్న ఈ కొత్త విధానం యొక్క పూర్తి వివరాల్లోకి వెళితే, క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్ అప్షన్ ఎంచుకునే కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ ఇక నుండి 5 రూపాయల రుసుమును జత చేస్తుంది. ఆన్లైన్ పేమెంట్  వారికి ఈ అదనపు ఫీజు వర్తించదు. అయితే, మీ ఆర్డర్ విలువ 500 రూపాయల కంటే తక్కువ వుంది ఆ ప్రోడక్ట్  Flipkart Plus క్రింద లిస్ట్ అయ్యి ఉన్నట్లయితే కనుక మీకు ఆ ఆర్డర్ పైన రూ. 40 రూపాయల డెలివరీ ఫీజు జత చేయబడుతుంది.

ఇక రూ.500 లేక అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ఆర్డర్స్ పైన ఎటువంటి డెలివరీ లేదా షిప్పింగ్ చార్జీలు ఉండవు. అంటే, మినిమమ్ అమౌంట్ కలిగిన ఆర్డర్స్ ను క్యాష్ ఆన్ డెలివరీ అప్షన్ తో ఎంచుకునే కస్టమర్లకు డెలివరీ ఛార్జ్ లు భారంగా మారవచ్చు. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :