ఇండియన్ ఈ- కామర్స్ వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ కో-ఫౌండర్స్ సచిన్ బన్సాల్ అండ్ బిన్నీ బన్సాల్ తాజాగా ఫోర్బ్స్ మాగజిన్ లో చోటు సంపాదించారు.
2007 లో బెంగుళూరులో ఫ్లిప్ కార్ట్ స్టార్ట్ అయ్యింది. మొదట్లో కేవలం బుక్స్ మాత్రమే అమ్మేది ఫ్లిప్ కార్ట్. ఫౌండర్స్ ఇద్దరూ దీనిని స్టార్ట్ చేయక ముందు అమెజాన్.com లో పనిచేసారు.
ఇండియాలో మొదటి సారి ఈ-కామర్స్ నుండి బిలియనీర్స్ గా ఫోర్బ్స్ లిస్ట్ లోకి ఎక్కారు. 1.3 బిలియన్ నెట్ worth తో 86 వ స్థానంలో ఉన్నారు ఇద్దరు. ఈ సారి ఈ-కామర్స్ కూడా టాప్ 100 సంపన్నుల జాబితాలో చేరటం గమనార్హం అన్నారు ఫోర్బ్స్ ఇండియా ఎడిటర్, సౌరవ్.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ముకేష్ అంబాని వరసుగా 9వ సారి మొదటి స్థానంలో ఉన్నారు ఇండియాలో. అయితే పోయిన సంవత్సరం కాన్నా ఈ year 31,061 కోట్లు తక్కువ నెట్ worth తో ఉన్నారు అంబాని.
ఫ్లిప్ కార్ట్ బన్సాల్ కో ఫౌండర్స్ తో పాటు, ఈ సంవత్సరం కొత్తగా ఫోర్బ్స్ లిస్టు లో 12 మంది యాడ్ అయ్యారు.. indiGo ఎయిర్లైన్స్ ఫ్లిప్ కార్ట్ కన్నా ముందు స్థానంలో ఉంది.