ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి ఈ ప్రోడక్ట్స్ పైన భారీ ఆఫర్లు అందుకోవచ్చట.!

Updated on 12-Jan-2023
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ తన అప్ కమింగ్ సేల్ డేట్ ని అనౌన్స్ చేసింది

రిపబ్లిక్ డే 2023 సందర్భంగా తీసుకువస్తున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్

ఎలక్ట్రానిక్స్ పైన గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్ ను అఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది

ఫ్లిప్ కార్ట్ తన అప్ కమింగ్ సేల్ డేట్ ని అనౌన్స్ చేసింది. రిపబ్లిక్ డే 2023 సందర్భంగా తీసుకువస్తున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి గొప్ప ఆఫర్లు మరియు డీల్స్ ను పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ సేల్ నుండి మొబిల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్, టీవీలు మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ మరియు ఆఫర్లను వినియోగదారులు పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ వెల్లడిస్తోంద. మరి ఈ ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ నుండి ఎటువంటి ఆఫర్లు ఇవ్వనున్నదో  తెలుసుకుందామా.

Flipkart అప్ కమింగ్ సేల్ Big Saving Days సేల్ ను citi మరియు ICICI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. అందుకే, ఈ రెండు బ్యాంక్ కార్డ్స్ ద్వారా షాపింగ్ చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ ఈ సేల్ నుండి లభిస్తుంది. అంటే, citi మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ కలిగిన వారికి ఈ సేల్ నుండి అదనపు డిస్కౌంట్ అందుతుంది.     

Flipkart అప్ కమింగ్ సేల్ Big Saving Days సేల్ టీజింగ్ పేజ్ ద్వారా ఏ ప్రోడక్ట్స్ పైన ఎంత వరకూ డిస్కౌంట్ అఫర్ చేయబోతోందో వెల్లడిస్తోంది. ఈ ఫ్లిప్ కార్ట్ మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తున్న ప్రకారం,  TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) పైన కూడా గరిష్టంగా 75% వరకు డిస్కౌంట్ అఫర్ ను పొందవచ్చని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ పైన గరిష్టంగా 80% వరకూ డిస్కౌంట్ ను అఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

మొబైల్ ఫోన్ల పైన కూడా గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను కూడా ప్రకటించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. అంటే, ఈ సేల్ నుండి  లేటెస్ట్ మొబైల్స్ ను మంచి డిస్కౌంట్ మరియు అఫర్ ధరకే అందుకునే అవకాశం కొనుగోలుదారులకు లభిస్తుంది.

ఇక ఈ సేల్ నుండి Flipkart Originals పైన కూడా మీరు 80% డిస్కౌంట్ ఆఫర్లను చూడవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. అలాగే, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ నుండి citi మరియు ICICI రెండు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI ద్వారా వస్తువులను కొనే వారు అధనపు తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :