Flipkart బిగ్ బిలియన్ సేల్స్ సందర్భంగా కొందరు ఫేక్ లింక్స్ అండ్ ఫేక్ డీల్స్ ఇన్ఫర్మేషన్ తో కొన్ని అర్థంలేని మెసేజ్ లను వాట్స్ అప్ అండ్ ఇతర మంద్యమాల్లో బాగా షేర్ చేస్తున్నారు.
అవన్నీ అసలైన flipkart ఆఫర్స్ కాదు. సో అలాంటి వాటికి దూరంగా ఉండండి. అయితే fake మెసేజ్ లను ఎలా కనుక్కోవాలి?
మెసేజ్ తో పాటు లింక్ ఉంటుంది. దానిని గమనిస్తే తెలిసిపోతుంది. flipkart కు దగ్గర గా ఉంటుంది కాని అసలైన flipkart.com కనిపించదు. same flipakart పేరుతో, అదే డిజైన్ సైట్ అండ్ లోగో కూడా ఉంటాయి ఈ ఫేక్ సైట్స్ కు.
సో అసలైన flipakrt.com అని లేకుండా దగ్గరా ఉండేలా ఎటువంటి లింక్స్ ఉన్నా అవి fake. ఫర్ eg: flipkart.dhamaka-offers.com, flipkart-bigbillion-sale.com. ఇది కేవలం flipkart కు మాత్రమే కాదు అమెజాన్ కూడా వర్తిస్తుంది.
వీటి పై క్లిక్ చేస్తే వచ్చే risks?
మీ షాపింగ్ పేమెంట్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ లీక్ అవటం వంటివి జరుగుతాయి. అలాగే మీ flipkart అకౌంట్ ఐడి లు కూడా. అంటే పర్సనల్ డేటా అండ్ మనీ రెండూ రిస్క్.
ఇలా వచ్చే లింక్స్ లో నిజమైనవి కూడా ఉండవచ్చు కదా?
ఇంతకుముందు ఫ్లిప్ కార్ట్ అండ్ అమెజాన్ లో అందరికన్నా ముందుగా వస్తువులను ఎలా కొనాలని తెలపటం జరిగింది. అది చదవని వారు ఈ లింక్ పై క్లిక్ చేసి చదవగలరు. జనాల ఆశలను ఆసరా గా చేసుకొని చేసే కొందరి scammers తెలివితేటలు ఇవి. మీరు ఇగ్నోర్ చేస్తేనే వాళ్ళు ఇటువంటి పనులను చేయటం ఆపేస్తారు.