Flipkart లో deals అంటూ కొన్ని మెసేజ్ లు వస్తున్నాయి. వాటిలో నిజం ఎంత?

Flipkart లో deals అంటూ కొన్ని మెసేజ్ లు వస్తున్నాయి. వాటిలో నిజం ఎంత?

Flipkart బిగ్ బిలియన్ సేల్స్ సందర్భంగా కొందరు ఫేక్ లింక్స్ అండ్ ఫేక్ డీల్స్ ఇన్ఫర్మేషన్ తో కొన్ని అర్థంలేని మెసేజ్ లను వాట్స్ అప్ అండ్ ఇతర మంద్యమాల్లో బాగా షేర్ చేస్తున్నారు.

అవన్నీ అసలైన flipkart ఆఫర్స్ కాదు. సో అలాంటి వాటికి దూరంగా ఉండండి. అయితే fake మెసేజ్ లను ఎలా కనుక్కోవాలి?

మెసేజ్ తో పాటు లింక్ ఉంటుంది. దానిని గమనిస్తే తెలిసిపోతుంది. flipkart కు దగ్గర గా ఉంటుంది కాని అసలైన flipkart.com కనిపించదు. same flipakart పేరుతో, అదే డిజైన్ సైట్ అండ్ లోగో కూడా ఉంటాయి ఈ ఫేక్ సైట్స్ కు.

సో అసలైన flipakrt.com అని లేకుండా దగ్గరా ఉండేలా ఎటువంటి లింక్స్ ఉన్నా అవి fake. ఫర్ eg: flipkart.dhamaka-offers.com, flipkart-bigbillion-sale.com. ఇది కేవలం flipkart కు మాత్రమే కాదు అమెజాన్ కూడా వర్తిస్తుంది.

వీటి పై క్లిక్ చేస్తే వచ్చే risks?
మీ షాపింగ్ పేమెంట్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ లీక్ అవటం వంటివి జరుగుతాయి. అలాగే మీ flipkart అకౌంట్ ఐడి లు కూడా.  అంటే పర్సనల్ డేటా అండ్ మనీ రెండూ రిస్క్.

ఇలా వచ్చే లింక్స్ లో నిజమైనవి కూడా ఉండవచ్చు కదా?

  • డీల్స్ అనేవి షేర్ చేసేవి కాదు, వీలైనంత తొందరగా వాటిని అయిపోయేలోపు కొందామనే అనుకుంటారు. డీల్స్ ను కొనే ఇంటరెస్ట్ లేని వ్యక్తి ఇలా విపరీతంగా స్ప్రెడ్ చేసే అంత ఇంటరెస్ట్ తో కూడా ఉండదు. అయినా మీ వరకూ వస్తున్నాయి అంటే వాళ్ళ కేదో లాభం ఉందని అర్థం.
  • Flipkart ఇటువంటి వెబ్ సైట్స్ ద్వారా SMS/ వాట్స్ అప్ మెసేజెస్ పంపదు. ఒరిజినల్ లింక్ spelling తో సహా తేడా లేకుండా క్లియర్ గా పంపిస్తుంది.

ఇంతకుముందు ఫ్లిప్ కార్ట్ అండ్ అమెజాన్ లో అందరికన్నా ముందుగా వస్తువులను ఎలా కొనాలని తెలపటం జరిగింది. అది చదవని వారు ఈ లింక్ పై క్లిక్ చేసి చదవగలరు. జనాల ఆశలను ఆసరా గా చేసుకొని చేసే కొందరి scammers తెలివితేటలు ఇవి. మీరు ఇగ్నోర్ చేస్తేనే వాళ్ళు ఇటువంటి పనులను చేయటం ఆపేస్తారు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo