snapdeal కొత్త వెబ్ సైటు లాంచ్

Updated on 05-Aug-2015
HIGHLIGHTS

చాలా తొందరగా షాపింగ్ చేసే ఐడియా తో..

షాపింగ్ ప్రపంచం ఇప్పుడు బయట లేదు, ఆన్ లైన్ లో ఉంది అంటే మొదట్లో కొంతమంది వ్యతిరేకించేవారు. ఇప్పుడు యూనివర్సల్ గా ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోక తప్పదు. ఇండియన్ షాపింగ్ సైట్, snapdeal ఈ రోజు కొత్త వెబ్ సైటు ను ప్రారంభించింది. దీని పేరు FindMyStyle.

ఊరికే మార్కెటింగ్ కోసం కాకుండా ఈ వెబ్సైటు లో నిజంగా మంచి కాన్సెప్ట్ ఉంది. సాధారణంగా షాపింగ్ వెబ్ సైట్స్ categorically మనకు చూపించబడతాయి. అయితే స్నాప్ డీల్ కొత్త సైటు లో ఐటమ్స్ స్టైల్స్ వైజ్ గా కూడా చూపించబడతాయి. జస్ట్ నేమింగ్ తో కాదు, ఇమేజెస్ తో స్టైల్స్ కేటగిరి అయ్యి ఉంటాయి ఫైండ్ మై స్టైల్ సైటు లో. ఉదాహరణకు మీకు బ్లాక్ కలర్ టి షర్ట్స్ లేదా ఒక పర్టికులర్ పేరు తెలియని స్టైల్ attire నచ్చితే దాని లాంటి మరిన్ని డిఫరెంట్ ప్రైసింగ్ లో ఉన్న క్లోతింగ్ షాపింగ్ ఈజీగా చేయగలరు. ఎందుకంటే ఇది సిమిలర్ స్టైలింగ్ కు సంబందించిన సైటు.

రియల్ టైమ్ లో మంచి ఫ్లెక్సిబుల్ ఫీచర్ అని చెప్పాలి. ఈ సైటు లో కి వెళ్లటానికి ఇక్కడ క్లిక్ చేయండి. క్లోతింగ్, ఫుట్ వేర్ ను ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి సైటు లో. both మెన్ అండ్ వుమెన్ కు ఐటమ్స్ ఉన్నాయి. ఐటమ్స్ అన్నీ స్నాప్ డీల్ నుండి అనుసంధానం అవుతాయి. జస్ట్ ఐడియా కోసం మాత్రమే ప్రత్యేకంగా సైటు ను స్టార్ట్ చేసింది.

ఇంతకముందే స్నాప్ డీల్ Shopo అనే యాప్ ను కూడా లాంచ్ చేసింది. దీని కాన్సెప్ట్ వైబ్ సైట్లలో లార్జ్ e కామర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేసే అవసరం లేకుండా కేవలం మొబైల్ ఒరియేంటెడ్ ఈ కామర్స్ చేస్తుంది. వస్తువు కొనే ముందు సేలర్స్ తో చాట్ చేయవచ్చు.

అంటే మీ ఫోనులో యాప్ ఉంటే చాలు మీరు ఏదైనా స్నాప్ డీల్ వంటి పెద్ద ఈ కామర్స్ ద్వారా ఎటువంటి కమిషన్ లేకుండా ఈజీగా ఏదైనా అమ్మవచ్చు, లేదా కొనవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్స్  Shopo ను డౌన్లోడ్ చేయటానికి ఈ లింక్ లోకి వెళ్లండి. ఐ ఫోన్ యూజర్స్ ఈ లింక్ నుండి దీనిని డౌన్లోడ్ చేయగలరు

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :