ఫేస్ బుక్ లో ఫేక్ న్యూస్ లకు చెక్ పెట్టనుంది కంపెని. రీసెంట్ గా అమెరికా ఎలెక్షన్ సమయంలో చాలా అవాస్తవ సమాచారాలు బాగా స్ప్రెడ్ అయ్యాయి. ఇలాంటి ఫేక్ న్యూస్ లను హైలైట్ చేసేందుకు ఫేస్ బుక్ కొత్త ఆప్షన్స్ పై పనిచేస్తుంది. త్వరలోనే అందరికీ వస్తుంది.
హిలరీ కు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పటానికి ముందుకు వచ్చిన వ్యక్తి హత్య చేయబడినట్లు మరియు క్రిస్టియన్ మత పెద్ద Pope కూడా Trumph కు మద్దతు పలుకుతున్నట్లు కొన్ని వార్తలు బాగా షేర్ అయ్యాయి ఫేస్ బుక్లో..
వాటిలో నిజం లేకపోయినా ఫేస్ బుక్ కోడింగ్ ప్రకారం users ఏదైతే ఎక్కువ కామెంట్, లైక్, షేరింగ్ చేస్తారు అవే ఎక్కువ పాపులర్ అవుతాయి ఫేస్ బుక్ లో. సో ఇక పై ఇలాంటివి జరిగినా వాటిని హైలైట్ చేసి తెలియజేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు.
న్యూస్ ఫీడ్ లో కనిపించే న్యూస్ లను పరిశిలించి, వాటిలో వాస్తవం లేదు అని తెలిస్తే ఆ పోస్ట్ ను రెడ్ కలర్ లో హైలైట్ చేసి, "news source is not reliable" లాంటి మెసేజ్ ఒకటి చూపిస్తుంది.
ఇది గ్లోబల్ గానే కాదు మనకు కూడా బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే సోషల్ మీడియా అనేది సమాచారం తెలియజేయటం నుండి అవాస్తవ రూమర్స్ ను బాగా స్ప్రెడ్ చేసే పరిస్థితిలలో వెళ్ళిపోయింది.
ఇందుకు కొన్ని ఉదాహరణలే, లేటెస్ట్ గా వచ్చిన Jio పై అనేకమైన రూమర్స్. అలాగే సినీ విషయాలు కూడా చాలా హాల్ చల్ అవుతాయి ఫేస్ బుక్లో. వీటిని కూడా ఫేస్ బుక్ హైలైట్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.