FASTag New Rules: ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్..!
దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి కొత్త FASTag New Rules అమలులోకి వచ్చాయి
కొత్త ఫాస్ట్ ట్యాగ్ నియమాలు హైవే అథారిటీ వెల్లడించింది
రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఫాస్ట్ ట్యాగ్ ను లింక్ చేయడం అవసరం
FASTag New Rules: దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి కొత్త ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అమలులోకి వచ్చాయి. ముందుగా టోల్ వద్ద నగదు చెల్లింపు తో వచ్చే ఇన్స్టాంట్ రిసిప్ట్ పద్ధతి నుంచి వేగవంతమైన ప్రాసెస్ చేసే ఫాస్ట్ ట్యాగ్ విధానం అమలులోకి వచ్చింది. ఫాస్ట్ ట్యాగ్ వచ్చి సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొత్త ఫాస్ట్ ట్యాగ్ నియమాలు హైవే అథారిటీ వెల్లడించింది.
ఏమిటా FASTag New Rules కొత్త నియమాలు?
ఫాస్ట్ ట్యాగ్ కలిగిన ఉన్న ప్రతి వాహనదారుడు కూడా వారి KYC ని అప్డేట్ చెయ్యాలి. ఫాస్ట్ ట్యాగ్ తీసుకొని 3 నుంచి 5 సంవత్సరాలు గడిచిన ప్రతి హోల్డర్ కి కూడా ఈ రూల్ వర్తిస్తుంది. అంటే, ఫాస్ట్ ట్యాగ్ తీసుకొని 3 నుంచి 5 సంవత్సరాల లోపు కాలం గడిచిన వారు వారి KYC ని అప్డేట్ చెయ్యాలి. అలాగే, ఫాస్ట్ ట్యాగ్ తీసుకొని 5 సంవత్సరాలు పైబడిన కస్టమర్లు పాత ఫాస్ట్ ట్యాగ్ ను మార్చుకోవాల్సి ఉంటుంది.
కొత్త వాహనం కొనుగోలు చేసిన వాహనదారులు కూడా 90 రోజుల లోపు ఆ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఫాస్ట్ ట్యాగ్ అప్డేట్ చెయ్యాలి. అంతేకాదు, పాత ఫాస్ట్ ట్యాగ్ యూజర్లు కూడా వారి వాహనం చాసిస్ నంబర్ మరియు రిజిస్ట్రేషన్ నంబర్ తో ఫాస్ట్ ట్యాగ్ ను లింక్ చేయడం అవసరం.
ప్రతి వాహనదారుడు కూడా అక్టోబర్ 31వ తేదీ లోపు వారి ఫాస్ట్ ట్యాగ్ తో KYC అప్డేట్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ కొత్త నియమాలు ఈరోజు (ఆగస్టు 1) నుంచి అమలు చేస్తుంది. వివరాలు అప్డేట్ చేయని పక్షంలో టోల్ ట్యాక్స్ చెల్లింపు సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కొత్త రూల్స్ ప్రకారం, ఎవరైతే ఫాస్ట్ ట్యాగ్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ప్రొవైడర్స్ వారికి సంబంధించిన డేటాని ధ్రువీకరించాల్సి ఉంటుంది. అంతేకాదు, కస్టమర్ల హై రిజల్యూషన్ ఫోటోలు కూడా అప్డేట్ చేయవలసి ఉంటుంది.
Also Read: కేవలం రూ. 13,999 ధరకే 160 inch స్క్రీన్ సైజ్ తో కొత్త స్మార్ట్ Projector లాంచ్ చేసిన జీబ్రానిక్స్.!
FASTag ను ఆన్లైన్లో ఎలా అప్డేట్ చేయాలి?
ఫాస్ట్ ట్యాగ్ ను ఆన్లైన్ లో చాలా సులభంగా అప్డేట్ చేయవచ్చు. దీనికోసం ముందుగా IHMCL ఫాస్ట్ ట్యాగ్ పోర్టల్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి మరియు ఇక్కడ’ మై ప్రొఫైల్’ పైన నొక్కాలి. ఇప్పుడు ఇక్కడ మీ KYC స్టేటస్ ను చెక్ చేసుకుని అప్డేట్ అవ్వకపోతే KYC అప్డేట్ ట్యాగ్ ను ఎంచుకోండి. ఇక్కడ మీ లేటెస్ట్ ఐడి ప్రూఫ్ తో KYC ని అప్డేట్ చేసుకోండి.