FASTag ప్లేస్ లో GNSS: హైవే ల పైన ప్రయాణించే వాహనదారులు టోల్ గెట్ ల వద్ద ఫిజికల్ గా టోల్ ఛార్జ్ చెల్లించే విధానం ఒకప్పుడు కొనసాగింది. అయితే, ఫిజికల్ టోల్ ఫీజు చెల్లింపు కు స్వస్తి పలుకు రెండు సంవత్సరాల క్రితం ఫాస్ట్ ట్యాగ్ విధానం తీసుకు వచ్చారు. అయితే, ఇందులో కూడా టోల్ గెట్ ల వద్ద లైన్ లో సమయం వాహనదారులు సమయం గడపాల్సి వస్తుంది. అందుకే, ఫిజికల్ గా ఉండే ఫాస్ట్ స్కాన్ తో కూడా పని లేకుండా ఆటోమాటిగ్గా టోల్ ఫీజు చెల్లించే కొత్త విధానం తీసుకు వస్తున్నారు.
వాహనం పైన అతికించిన ఫాస్ట్ ట్యాగ్ ను టోల్ గేట్ వద్ద ఫిట్ చేసిన ఫాస్ట్ ట్యాగ్ స్కానర్ లతో స్కాన్ చేసిన తరువాతే వాహనం టోల్ గెట్ డేట్ అవకాశం ఉంటుంది. అయితే, రద్దీగా వుండే హైవే పైన చాలా సమయాల్లో టోల్ గేట్ వద్ద లైన్ లో టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాదు, అప్పుడప్పుడు ఫాస్ట్ ట్యాగ్ కార్డ్ స్కాన్ లో సమస్యల కారణంగా కూడా వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
అందుకే, ఫిజికల్ స్కాన్ తో పని లేకుండా టోల్ దాటగానే టోల్ ఫీజు ను ఆటోమాటిగ్గా లెక్కించే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టం (జిఎన్ఎస్ఎస్) ను తీసుకు రావడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ కొత్త టెక్నాలజీతో టోల్ గేట్ వద్ద స్కాన్ తో పని లేకుండా టోల్ ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది.
Also Read: OPPO K12x 5G: చవక ధరలో 45W ఫాస్ట్ ఛార్జ్ తో కొత్త ఫోన్ తెచ్చిన ఒప్పో.!
టోల్ దాటగానే టోల్ ఫీజు ను ఆటోమాటిగ్గా లెక్కించడానికి ఈ కొత్త సిస్టం GPS మరియు GPS- ఎయిడెడ్ GEO అగ్యుమెంటెడ్ నేవిగేషన్ (GAGAN) ను ఉపయోగించి వెహికల్ టోల్ ఆధారిత లెక్క కడుతుంది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఫాస్ట్ ట్యాగ్ స్థానంలో ఈ కొత్త జిఎన్ఎస్ఎస్ ను రీ ప్లేస్ చేయడానికి చూస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే బెంగళూరు – మైసూరు (కర్ణాటక) (NH 275) ఎక్స్ ప్రెస్ హైవే మరియు పానిపట్టు – హిస్సార్ (హర్యానా) (NH – 709) మార్గంలో ఈ కొత్త సిస్టం ను ఇప్పటికే అమల్లోకి తీసుకు వచ్చారు. రానున్న రోజుల్లో అన్ని టోల్ ప్లాజాల పైన కూడా ఈ కొత్త సిస్టం తీసుకురావచ్చని ఊహిస్తున్నారు.