మీ కంప్యూటర్ లోని హానికరమైన సాఫ్టవేర్ లను తీసేందుకు ఫేస్ బుక్ ఒక కొత్త టూల్ పై చేస్తుంది. ఇందుకోసం Kaspersky వంటి యాంటీ వైరస్ సాఫ్టవేర్ తో 3 నెలలుగా కలిసి పనిచేస్తుంది ఫేస్ బుక్.
యూజర్ యొక్క ఫేస్ బుక్ అకౌంట్ కు అనుసంధానం అయిన కంప్యూటర్ లో ఎటువంటి హానికరమైన వైరస్ స్పామ్ లు ఉన్నాయంటే, వాటిని రిమూవ్ చేస్తుంది. కేవలం సోషల్ నెట్‌వర్కింగ్ ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇలాంటి కామన్ నీడ్స్ ను కూడా పరిగణించి వాటికీ సొల్యూషన్స్ ను తెచ్చి, ఇంటర్నెట్ వినియోగదారులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ నిలదొక్కుకుంటుంది ఫేస్ బుక్.
మీరు ఫేస్ బుక్ బ్రౌజ్ చేసుకుంటుండగానే బ్యాక్ గ్రౌండ్ లో ఆ క్లీనింగ్ టూల్ స్కానింగ్ చేసి మీ కంప్యూటర్ లో ఎటువంటి మాల్ వేర్ ఉందో నోటిఫికేషన్ ఇస్తుంది. దీనితో పాటు మీరు ఏదైనా అనుమానాస్పద వైరస్ లింక్ ను క్లిక్ చేస్తే క్రింద ఇమేజ్ వలె నోటిఫై చేస్తుంది ఫేస్ బుక్ కొత్త టూల్.
ఆధారం: ET, Kaspersky Blog