ఇకనుండి ఫేస్బుక్ స్టేటస్ అప్డేట్లను సజెస్ట్ చేస్తుంది.

Updated on 19-Jun-2015
HIGHLIGHTS

ట్రేండింగ్ టాపిక్స్ ఆధారంగా మీకు స్టేటస్ అప్డేట్ ను సజెస్ట్ చేయనుంది

ఎప్పటికప్పుడు యూజర్స్ కు కొత్త కొత్త ఫీచర్స్ ను ఇచ్చే ఫేస్బుక్ ఇప్పుడు మళ్ళీ కొత్త ఫీచర్ తో వస్తుంది. మీ FB యూసేజ్ స్టేటిస్టిక్స్ బేస్ చేసుకొని, మీరు ప్రిఫర్ చేసే కంటెంట్, రీసెంట్ యాక్టివిటీస్, కామెంట్స్, షేర్స్ అను ఆధారంగా కొన్ని స్టేటస్ అప్డేట్స్ ను మీకు సజెస్ట్ చేయటమే ఈ ఫీచర్.

తాజాగా న్యూస్ ఫీడ్ లో యూజర్ ఎక్కువుగా టైమ్ స్పెండ్ చేస్తున్న స్టోరీస్ ను బేస్ చేసుకొని వారి న్యూస్ ఫీడ్ లో ప్రియారిటీ ఇచ్చే సరి కొత్త న్యూస్ ఫీడ్ అల్గారిథంస్ ను ప్రవేశపెట్టింది. మీరు దీనిపై ఎంత టైమ్ గడుపుతున్నారో తెలుసుకొని, అలంటి స్తోరిస్ నే న్యూస్ ఫీడ్ లో చూపిస్తుంది ఇది. ఇప్పుడు సేమ్ ఇదే అల్గారిథం తో మీరు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్న కంటెంట్ ను ఆధరంగా తీసుకోని, మీకు స్టేటస్ లను అప్డేట్ చేసేందుకు కొన్ని సజెషన్స్ ఇవ్వనుంది.

                   

హాష్ ట్యాగ్ లతో కొన్ని స్టేటస్ లు ఉంటాయి, వాటిని మీరు సెలక్ట్ చేసుకుంటే మీ టైమ్ లైన్ నుండి అవి పోస్ట్ అవుతాయి. ఇది టైపింగ్ ను మరియు సెంటెన్స్ ఫర్మేషన్ పై శ్రమ లేకుండా చేసే ఫీచర్. చాలా మంది ఒక విషయాన్ని ఎలా చెబితే ఎక్కువ లైక్స్ వస్తాయి, ఎక్కువ Attractive గా ఉంటుంది అని కేవలం వారు చెప్పదలుచుకున్న విషయాన్ని సెంటెన్స్ ఫార్మేషన్ చేయటానికి కొన్ని గంటలు తీసుకుని టైమ్ వెస్ట్ చేస్తుంటారు. ఇది ఎంత నిజమో ఇండివిడ్యువల్ గా అందరికీ తెలుసు 🙂

ఆధారం: Zee News

Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class.

Connect On :