ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ కంటెంట్ ను మార్చనుంది అని ఫేస్బుక్ తాజాగా newsroom blog లో అనౌన్స్ చేసింది. యూజర్స్ ఏది లైక్ మరియు కామెంట్ చేస్తారో అనే డేటా పై కాకుండా ఇక పై ఒక స్టోరీ ను చదవటానికి ఎంత టైమ్ ను స్పెండ్ చేస్తున్నారనే దానిని దృష్టిలో పెట్టుకొని న్యూస్ ఫీడ్ లో కంటెంట్ ను చూపించనుంది. యూజర్ ఫేస్బుక్ కు ఇచ్చే ఫీడ్ బ్యాక్ డేటా ఆధారంగా ఇది ప్రాక్టికల్గా వర్క్ అవుట్ అవుతుంది. "ఒక పోస్ట్ ను లైక్ చేయనంత మాత్రానా దానిపై యూజర్ ఇంటరెస్ట్ గా లేడని కాదు" అని చెప్పింది ఫేస్బుక్.
కొన్ని సీరియస్ మరియు సెన్సిటివ్ ఆర్టికల్స్ ను లైక్ లేదా కామెంట్స్ చేయని పరిస్తితులు ఉంటాయి. వాటిని లైక్ చేయకుండా ఎక్కువ సేపు వాటిని చదవటం, చూడటం వంటివి చేస్తుంటారు నెటిజన్లు. ఇలాంటి విషయాలను మరియు ఇతర యూజర్ ఎక్పిరియన్స్ బేస్డ్ డేటా ను పరిశీలించి ఫేస్బుక్ కొత్త న్యూస్ ఫీడ్ అల్గారిథంస్ ను తీసుకువస్తుంది.
అయితే ఒక స్టోరీ పై కొందరు ఇష్టపడి ఎక్కువ సేపు గడిపితే మరికొంతమంది స్లో నెట్ కనెక్షన్ వలన ఎక్కువ సేపు గడిపే అవకాశాలు ఉంటాయి. సో ఏవరేజ్ రిలేటివ్ టైమ్ ను తీసుకోని ఫీడ్ ను మారుస్తుంది. కొన్ని వారాల్లో ఈ న్యూస్ ఫీడ్ మార్పు యూజర్స్ కు రానుంది.