ఫేస్ బుక్ లో వీడియో ప్రొఫైల్ పిక్చర్స్

Updated on 02-Oct-2015

ఫేస్ బుక్  ప్రొఫైల్ పిక్స్ లో ఇక నుండి వీడియో పెట్టుకునే ఆప్షన్ పై వర్క్ చేస్తుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. ఆల్రెడీ మీ ఫేస్ బుక్ యాప్ అప్ డేట్ అయ్యి ఉంటే.. ప్రొఫైల్ పిక్ మార్చటానికి ట్రై చేయండి. అక్కడ వీడియో ఆప్షన్ కమింగ్ సూన్ అని కనిపిస్తుంది.

అంటే ప్రొఫైల్ పిక్ బదులు వీడియో కూడా పెట్టుకోగలరు. అయితే ఆ వీడియో 7 సేకేండ్లు ఉంటుంది. అంటే ప్రొఫైల్ వీడియో అలా లూప్ లో రన్ అవుతూ ఉంటుంది. దీని పేరు, ప్రొఫైల్ వీడియోస్.

దీనితో పాటు ఫేస్ బుక్ టెంపరరీ ప్రొఫైల్ పిక్ ఆప్షన్ పై వర్క్ చేస్తుంది. ఇది యూస్ఫుల్ ఫీచర్. మీరు డిజిటల్ ఇండియా లేదా ఏదైనా పర్టికులర్ డే కు అనుగుణంగా ప్రొఫైల్ పిక్ పెట్టి దానిని మళ్ళీ ఒక 2 డేస్ తరువాత మార్చాలనుకుంటే ఆ పని ఫేస్ బుక్ ఆటోమేటిక్ గా చేస్తుంది.

వీటితో పాటు మొబైల్ లో ఫేస్ బుక్ ప్రొఫైల్ లుక్ లో కొన్ని మార్పులు చేయటానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం మొబైల్ లో ప్రొఫైల్ పిక్ డెస్క్ టాప్ లాన్ రైట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు అది సెంటర్ లోకి తెచ్చే మార్పులు చేస్తుంది,

గత వారం ఫేస్ బుక్ 360 డిగ్రీ వీడియో ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇది న్యూస్ ఫీడ్ లో ఉండే వీడియోలను చూసే విధంలో కొత్త ఎక్స్పిరియన్స్ ఇస్తుంది. ప్రస్తుతం దశలు వారీగా ముందు ఆండ్రాయిడ్ అండ్ డెస్క్ టాప్ లకు ఇస్తుంది. ఆ తరువాత ఐ os లకు రానుంది.

 

Connect On :