ఇండియాలో ఫేస్ బుక్ లో కొత్తగా సర్వీసెస్ ప్రారంభం
ఫేస్ బుక్ Services ను ప్రవేశ పెట్టింది ఇండియాలో. ఇది hyperlocal మార్కెట్ ప్లాట్ఫారం వంటిది. చూడటానికి మీరు facebook.com/services లింక్ ను ఓపెన్ చేయగలరు.
మెడికల్ అండ్ హెల్త్, Pet సర్వీస్, ఆటోమోటివ్, ఆర్ట్స్ అండ్ మార్కెటింగ్, plumber మరియు ఇంకా చాలా అవసరాలకు సర్వీస్ ను అందించే ప్రయత్నం చేస్తుంది ఫేస్ బుక్ దీని ద్వారా.
ఆ సర్వీసెస్ యొక్క ఫేస్ బుక్ పేజెస్ రేటింగ్స్ ను కూడా తెలుసుకోగలరు. మీరు పైన చెప్పిన url లింక్ ను ఓపెన్ చేస్తే మీ ఏరియా మరియు ఏమి సర్వీస్ కావాలో వాటిని ఎంటర్ చేసి సర్చ్ పై క్లిక్ చేయాలి..
ఇప్పుడు రిసల్ట్స్ లో పేజెస్ తో పాటు వాళ్ళ ఫోన్ నంబర్, అడ్రెస్ అండ్ రేటింగ్ లను అందిస్తుంది ఫేస్ బుక్. ఫర్ eg మీకు spa saloon బిజినెస్ ఉండి, దాని పై ఒక పేజ్ క్రియేట్ చేసి ఉంటే, ఎవరైనా స్పా లను వెతికినప్పుడు మీ పేజ్ కనిపిస్తుంది వారికీ..
ఇది ఇంకా ప్రారంభ దశలో ఉంది ఇండియాలో. అమెరికా లో ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అయితే ఇలాంటి అవసరాలను అందించానికి ఇప్పుడు urban clap, haptik personal assistant వంటి చాలా స్టార్ట్ అప్స్/యాప్స్ ఆరతపడతున్నాయి.