తాజాగా ఫేస్బుక్ తన న్యూస్ ఫీడ్ లో GIF (కదిలే ఇమేజ్) ఇమేజ్ లను పోస్ట్ చేసుకునే విధంగా కొత్త ఫీచర్ ను అమల్లోకి తెస్తునట్లు అధికారికంగా వెల్లడించింది. GIF ఇమేజ్ సపోర్ట్ మొబైల్ మరియు వెబ్ వెర్షన్స్ లో కూడా పనిచేస్తుంది.
GIF ఇమేజ్ సపోర్ట్ పై యూజర్స్ చాలా మంది ఎక్కువుగా కోరిన ఆప్షన్ అని చెప్పింది ఫేస్బుక్. త్వరలోనే కంపెని చేంజెస్ చేసి యూజర్స్ ఏనిమేటెడ్ పిక్స్ ను పోస్ట్ చేసేందుకు సహకరించనుంది. కాకపోతే వాళ్ళ కంప్యూటర్ లో నుండి GIF ఇమేజ్ లను అప్లోడ్ చేసేందుకు అవ్వదు, కాని " .gif" తో ఎండ్ అయ్యే లింక్ లను పేస్ట్ చేసేందుకు సహకరిస్తుంది ఫేస్బుక్. Giphy మరియు Imgur వంటి GIF ఇమేజ్ సర్విసుల సహాయంతో ఏనిమేటెడ్ ఇమేజెస్ ను పేస్ట్ చేసుకోవచ్చు. అది కూడా తమ సొంత ప్రోఫైల్స్ లోనే ఇది సాధ్యం అవుతుంది. పేజెస్ లో పేస్ట్ చేయటానికి కుదరదు.
ఫేస్బుక్ స్పోక్స్ పర్సెన్ మాట్లాడుతూ.. "మీరు మీ టైం లైన్ ను చూస్తున్నప్పుడు GIF, వీడియో వలె ఆటోమేటిక్ గా ఇమేజ్ ఏనిమేషన్ ప్లే అవుతుంది. ఇవి స్నేహితులతో మరింత ఫన్ ను జెనెరేట్ చేయనున్నాయి. అవి ఆటోమేటిక్ గా ఏనిమేట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఆటో ప్లే ను డిసెబల్ చేసుకొని, వాటిపై క్లిక్ చేసినప్పుడు మాత్రమే ప్లే అయ్యే లా చేసుకోవచ్చు." అని అన్నారు.
అయితే గతంలో GIF సపోర్ట్ ని ఫేస్బుక్ ఆపేసి, టైం లైన్ లో తక్కువ నాణ్యత గల GIF లతో ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ అంతా చిన్నగా కనిపిస్తుంది అని చెప్పింది. GIF బదులు, 2013 లో విడియో లను అనుసంధానం చేసింది. అయితే తాజగా ట్విటర్ GIF సపోర్ట్ ను ఏడ్ చేయటంతో ఫేస్బుక్ బలవంతంగా మళ్ళీ ఏడ్ చేయవలిసి వచ్చింది. ఇప్పుడు ఏనిమేటెడ్ GIF ఇమేజెస్ సోషల్ నెట్వర్కింగ్ లలో చాలా ఫేమస్ గా తయారు అయ్యాయి.
ఆధారం: TechCrunch