ఫేస్ బుక్,ఇన్స్టాగ్రామ్ విడుదల చేసిన డిజిటల్ వెల్ – బీయింగ్ టూల్స్ వినియోగదారులు సోషల్ మీడియాలో గడిపిన సమయాన్ని పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి సహాయపడతాయి

ఫేస్ బుక్,ఇన్స్టాగ్రామ్ విడుదల చేసిన డిజిటల్ వెల్ – బీయింగ్ టూల్స్ వినియోగదారులు సోషల్ మీడియాలో గడిపిన సమయాన్ని పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి సహాయపడతాయి
HIGHLIGHTS

ఫేస్ బుక్ ప్లాట్ఫారం మరియు ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల కోసం వారి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సహాయం చేయడానికి మరియు వారి యొక్క సమయాన్ని నిర్వహించడానికి డాష్బోర్డును ప్రారంభించింది.

సాంకేతిక పరిజ్ఞాన కంపెనీలు తమ సేవలు ప్రజల మనస్సులను ప్రభావితం చేసే విధంగా అన్వేషణలో ఉన్నాయి. ఉదాహరణకు, ఫేస్ బుక్, సోషల్ మీడియాలో  ఎక్కువ సమయం గడపడం ప్రజలకు చెడ్డగా ఎలా ఉంటుందో అనేదాన్ని  గురించి వివరంగా మాట్లాడారు. ఈ సంవత్సరం Google I /O యొక్క  Android P లో ఆక్టివిటీ డాష్బోర్డ్ ని పరిచయం చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం ప్రకటించిన మొదటి కంపెనీల్లో గూగుల్ ఒకటి. ఆపిల్ iOS లో స్క్రీన్ టైముని  పరిచయం చేయడం ద్వారా అదే అనుసరించింది. అదే పద్ధతిని అనుసరించి,ఫేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లలో  వారి సమయాన్ని నిర్వహించడానికి వినియోగదారులకు సహాయపడటానికి ఫేస్ బుక్ కొత్త సాధనాలను ప్రవేశపెట్టింది.

" ప్రజలు ఫేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లలో వారి సమయం నిర్వహించందడానికి  సహాయంగా మేము ఈ రోజు ఒక కొత్త టూల్స్ ప్రకటిస్తున్నాము: అవి రోజువారీ  రిమైండర్ మరియు నోటిఫికేషన్లను పరిమితం చేయడానికి ఒక కొత్త మార్గం.   మేము ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణులు మరియు సంస్థలు, విద్యావేత్తలు, మా మా కమ్యూనిటీ నుండి అందిన పరిశోధన మరియు అభిప్రాయాల నుండి సహకారం మరియు ప్రేరణ ఆధారంగా ఈ ఉపకరణాలను అభివృద్ధి చేశాము. ఫేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో ప్రజలు ఖర్చుపెడుతున్న సమయం మనకు కావాలి అది ఉద్దేశపూర్వకంగా, నిస్సందేహమైన మరియు స్ఫూర్తినిచ్చేదిగా,ఉండాలి", అని ఇన్స్టాగ్రామ్ యొక్క ఉత్పత్తి నిర్వహణ డైరెక్టర్ అయిన అమీత్ రణదీవ్ మరియు ఫేస్ బుక్ యొక్క పరిశోధనా డైరెక్టర్ అయిన  డేవిడ్ గిన్స్ బెర్గ్ ఒక బ్లాగులో తెలిపారు.

ఈ టూల్స్ వాల్ల వినియోగదారులు ప్లాట్ఫారమ్లలో గడుపుతున్న సమయముపై వారికి అధిక నియంత్రణను ఇస్తుంది.  ఇంకా తల్లిదండ్రులకు మరియు టీనేజ్లకు  మధ్య ఉన్న సంభాషణలు వాటికి సరిపడే ఆన్లైన్ అలవాట్ల గురించి ప్రోత్సహించవచ్చని కంపెనీ భావిస్తోంది. ఈ సాధనాలు ఫేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ల కోసం అందుబాటులో ఉంటాయి.

ఈ యాక్సెస్ ను పొందడానికి, మీరు యాప్స్ యొక్క సెట్టింగులు పేజీలో వెళ్లాలి. ఇన్స్టాగ్రామ్ లో  "యువర్ ఆక్టివిటీ ," మీద నొక్కవలసి ఉంటుంది  మరియు ఫేస్ బుక్ లో , " యువర్ టైమ్ ఆన్ ఫేస్ బుక్ " నొక్కవల్సి వుంటుంది . పైభాగంలో, మీరు ఆ పరికరంలో ఆ యాప్  కోసం మీ సగటు సమయం చూపించే డాష్బోర్డ్ చూస్తారు. ఆ రోజు మీ మొత్తం సమయాన్ని చూడడానికి ఏదైనా బార్ని నొక్కండి. డాష్బోర్డు క్రింద, మీరు ఆ రోజు కోసం ఆ యాప్ లో ఖర్చు చేయాలనుకునే సమయాన్ని మీరు చేరుకున్నప్పుడు మిమ్మల్ని హెచ్చరించడానికి రోజువారీ రిమైండర్ని కూడా మీరు సెట్ చేయవచ్చు. ఫేస్ బుక్ వారు ఎప్పుడైనా రిమైండర్ని మార్చడానికి లేదా రద్దు చేయడానికి ప్రజలకు ఒక ఎంపికను ఇచ్చింది. మీరు పని మీద దృష్టి పెట్టవలసిన సమయాల్లో, మీ ఫేస్ బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్లను పరిమితం చేయడానికి కొత్త "మ్యూట్ పుష్ నోటిఫికేషన్" సెట్టింగులను త్వరగా యాక్సెస్ చేయడానికి "నోటిఫికేషన్ సెట్టింగులు" నొక్కవచ్చు.

మా ప్లాట్ఫారమ్లలో వారు ఎంత సమయం గడుపుతున్నారన్నది  ప్రజలకు అర్థం చేసుకునేలా చేయడంలో మాకు బాధ్యత ఉంది, అందువల్ల వారు వారి అనుభూతిని బాగా నిర్వహించవచ్చు. 2017 డిసెంబరులో, ఫేస్ బుక్ లో ఉన్న  ప్రజలను కనెక్ట్ చేసుకోవడానికి మరియు సంబంధాలను పెంచుకోవడానికి  సహాయపడే అనుభవాన్ని సృష్టించేందుకు మేము ఏమి చేస్తున్నామో తెలుసుకోవడం గురించి మేము మెళకువలను అందించాము"అని అధికారులు చెప్పారు.

సరికొత్త మెరుగులు దిద్దిన ఈ టూల్స్ ని ఇప్పటికే విడుదల చేసింది వినియోగదారుల కోసం ప్రారంభించే కార్యక్రమాలు మరియు ఫీచర్లను తాజాగా చేస్తున్నారు, వారు చూడాలనుకుంటున్న కంటెంట్ ని నియంత్రించడానికి వినియోగదారులను బలపరిచేందుకు, వారి  మొత్తం అనుభవాన్ని మెరుగుపరచనుంది  ఈ సోషల్ మీడియా దిగ్గజం. గత సంవత్సరం, సీ ఫస్ట్ , హైడ్, అన్ ఫాలో, మరియు కీవర్డ్ స్నూజ్ వంటి లక్షణాలతో  సంబంధిత పోస్ట్ లను వ్యక్తులకు చూపించడానికి న్యూస్ ఫీడ్  నాణ్యతను అత్యంత మెరుగుపరిచింది. ఇన్స్టాగ్రామ్ లో, కంపెనీ "యు ఆర్ ఆల్ క్యాచ్ అప్" మెసేజ్ ఇన్ ఫీడ్, కీవర్డ్ ఫిల్టరింగ్, సేన్సిటివిటి స్క్రీన్స్ మరియు అఫన్సివ్  కామెంట్ మరియు బుల్లయింగ్ ఫిల్టర్ల వంటి సందేశాలను, కమ్యూనిటీకి గురించి ముందుగా శ్రద్ధ వహించడానికి.

" ప్రయోగాత్మక గుర్తింపు విస్తరణ మరియు మొదటి స్పందన గుర్తింపును మెరుగుపరచడంతో సహా, ఆత్మహత్య నివారణకు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్ననివారణ చర్యలకు మేము కూడా నిబద్ధత కలిగి ఉన్నాము. మా విధానం, సేవ్.ఓఆర్జీ వంటి మానసిక ఆరోగ్య సంస్థలు సహకారంతో మరియు  ఆత్మహత్య ప్రయత్నం చేయాలనుకున్న ఆలోచనచేసిన వ్యక్తుల యొక్క   వ్యక్తిగత అనుభవంనుండి ఆధారంగా  అభివృద్ధి చేయబడింది",అని  పేస్ బుక్  పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo