ఫేస్బుక్ వందల వేలకొద్దీ వున్నయాప్స్ యొక్క వినియోగదారుల డేటా యాక్సెస్ ని తగ్గించింది

Updated on 03-Aug-2018
HIGHLIGHTS

పేస్ బుక్ ఆగష్టు 1 ను కొత్త రివ్యూ ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవటానికి మరియు రిపోర్ట్ కోసం దరఖాస్తు చేయని వాటికి API యాక్సెస్ రద్దు చేయబడినట్లుగా ప్రకటించింది.

ఫేస్ బుక్ యాప్స్ కోసం అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) యాక్సెస్ ని  తగ్గిచింది. అయితే,ఇది  అన్నియాప్స్ కు వర్తించదు. సంస్థ తన కొత్త యాప్ సమీక్ష ప్రాసెస్ కోసం సమర్పించని "వందల వేల" ఇనాక్టివ్ యాప్స్ కోసం యాక్సెస్ ని  ఉపసంహరించుకుంటోంది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా ప్రైవసి కుంభకోణం వెలుగులోకి వచ్చిన తరువాత, ఫేస్ బుక్ తన ప్లాట్ఫారమ్ లను  ప్రస్తుత యాప్ ల  వినియోగదారుని డేటాను ఎలా నిర్వహించాలో కంపెనీ నిబంధనలు మరియు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటానికి మరింత కఠినమైన సమీక్ష ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుందని ప్రకటించింది.

సంస్థ యొక్క F8 డెవలపర్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ ప్రకటన మే నెలలో తిరిగి వెలుగులోకి వచ్చింది మరియు ఈ కార్యక్రమంలో, ఆగష్టు 1వ తేదీని కొత్త మార్గదర్శకాల క్రింద సమీక్ష కోసం మళ్లీ వారి యాప్స్ సమర్పించటానికి వ్యాపారాలకు  మరియు డెవలపర్లకు గడువుగా నిర్ణయించింది. ఇప్పుడు వాడుకలో ఉన్న యాప్స్ ని కొత్త ప్రక్రియ క్రింద సమీక్షించబడటానికి దరఖాస్తు చేయనివారు ఇప్పుడు చేసుకోవాలని పేస్ బుక్ చెప్పింది. ప్లేట్ఫారం యొక్క విధానాలకు అనుగుణంగా ఉన్నంత వరకు.,రివ్యూ కోసం వరుసలో ఉన్న అన్ని యాప్స్ కూడా APIయాక్సెస్ ని కోల్పోవు అని గమనించాలి.

పేస్ బుక్ ఇప్పుడు "రివ్యూ కోసం ఆప్ లను ముందుగా ఒక వరుసక్రమం" లో ఉంచనుంది, కాబట్టి ఇవన్నీ కూడా పరిశోధనలో భాగంగా వుంటాయి. ఈ యాప్స్ యొక్క  డెవలపర్లు మరింత సమాచారం కోసం ప్రశ్నించే వీలుంది, దీనికి ప్రతిస్పందించడానికి వారికి పరిమిత సమయం ఉంది. నిర్దేశించబడిన సమయ పరిధిలో ప్రశ్నకు తిరిగి సమాధానం రాకపోతే, యాప్లకోసం నిర్దేశించిన API  యాప్ యొక్క యాక్సిస్ నిలిపివేస్తుంది. పేస్ బుక్ యొక్క ఉత్పత్తి భాగస్వామ్యాల వీపీ అయినటువంటి ఇమే ఆర్చిబాంగ్, ఒక బ్లాగ్ పోస్ట్ లో వ్రాస్తూ, "మేము ఇంకా వాడబడుతున్న యాప్స్ ను ప్రోత్సహిస్తున్నాము కాని ప్రస్తుతం సమీక్ష కోసం సమర్పించని వాటిని త్వరగా సమర్పించాలి. అయితే, ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న అన్ని యాప్స్ మా సమీక్ష విధానం ద్వారా నిర్థారించడానికి, మేము సమీక్ష కోసం యాప్స్ ను ముందుగా అభివృద్ధి చేస్తాము. మాకు మరింత సమాచారం కావాలంటే, డెవలపర్లు ప్రతిస్పందించడానికి పరిమిత సమయం ఉంటుంది. ఒకవేళ మేము ఆ సమయ పరిధిలో తిరిగి సంధానం పొందకపోతే ,  API ఆమోదం  కోసం యాప్స్ యొక్క యాక్సెస్ ని మేము తొలగిస్తాము" అని వివరించారు.

మార్చి నెలలో, వినియోగదారుడు గత మూడు నెలల్లో వాడుకలో లేని ఏదైనా ఆప్ యొక్క  వినియోగదారు సమాచార యాక్సెస్ నిలిపివేశారు. దీని తరువాత గ్రూప్ యొక్క వినియోగదారుల సున్నితమైన డేటాను యాక్సెస్ చేయకుండా థర్డ్ పార్టీ  యాప్స్ ని  నిలిపివేసింది మరియు మూడు నెలల తరువాత ఈ అనువర్తనాలు గ్రూప్ వినియోగదారు డేటాను యాక్సెస్ చేయడానికి మళ్లీ అనుమతించాయని ప్రకటించింది. అయినప్పటికీ, వారు కఠినమైన మానవ-పరిశీల ఆమోద ప్రక్రియ ద్వారా వెళ్లాలి మరియు వారు సభ్యుల జాబితా మరియు ఇతర సున్నితమైన డేటాకు యాక్సెస్ ఉండదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :