EPF గుడ్ న్యూస్..మీ PF అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి.!

Updated on 08-Nov-2022
HIGHLIGHTS

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ ప్రకటించింది

అకౌంట్ లలోకి వడ్డీ డబ్బును జమ చేయడం ప్రారంభించినట్లు EPFO వెల్లడించింది

మీ EPF పాస్‌బుక్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది

ప్రైవేట్ ఎంప్లాయిస్ కి ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్ కలిగిన ఎంప్లాయిస్ యొక్క అకౌంట్ లలోకి వడ్డీ డబ్బును జమ చేయడం ప్రారంభించినట్లు EPFO వెల్లడించింది. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ ఈ విషయాన్ని అక్టోబర్ 31న ట్వీట్ ద్వారా తెలియ చేసింది. మీ PF అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి, తద్వారా మీ PF అకౌంట్ లో జమ చేసిన వడ్డీ వివరాలను చూడవచ్చు. దీనికోసం, మీరు మీ EPF పాస్‌బుక్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఈమెయే పాస్ బుక్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలాగో మీకు తెలియక పోయినట్లయితే, ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

పాస్ బుక్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలాగ?

ముందుగా మీరు EPFO అధికారిక వెబ్సైట్ epfindia.gov.in ను ఓపెన్ చెయ్యాలి. తరువాత ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి 'service' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇందులో మీరు 'For Employees' అప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ పేజీలో క్రింద సర్వీస్ బాక్స్ లో 'Member Pass Book'  అనే అప్షన్ కనిపిస్తుంది దాని పైన నొక్కండి. వెంటనే మీకు మరొక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ UAN మరియు పాస్వర్డ్ ను ఎంటర్ చేసి క్రింద ఉన్న బాక్సులో క్యాప్చాను అడుగుతుంది. మీరు ఈ వివరాలన్నింటిని నమోదు చేసి ఎంటర్ చెయ్యాలి.

ఇప్పుడు ఇక్కడ మీకు డౌన్‌లోడ్ పాస్‌బుక్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డౌన్‌లోడ్ అప్షన్ పైన నొక్కండి మరియు పాస్ బుక్ డౌన్ లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసిన తర్వాత, మీ EPF ఖాతా సాఫ్ట్ కాపీ మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌కు వస్తుంది. మీ వడ్డీ పెరిగిందా లేదా అనేది మీరు ఇక్కడ తనిఖీ చేయవచ్చు.

ఇంకా ఈజీగా తెలుసుకోవడానికి మరో రెండు పద్ధతులున్నాయి. మీరు మీ రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ నుండి SMS మరియు మిస్డ్ కాల్ సర్వీసులను కూడా ఉపయోగించవచ్చు. అయితే, ఇందులో మీ మొత్తం బ్యాలన్స్ మాత్రమే వస్తుంది. దీనికోసం "EPFOHO UAN" అని టైప్ చేసి 7738299899 నంబర్ కు సెండ్ చేయాలి. ఇక్కడ UAN అంటే మీ UAN నంబర్ ఎంటర్ చేయాలి.

ఇక మిస్డ్ కాల్ సర్వీస్ విషయానికి వస్తే, మీ రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ నుండి  9966044425 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మీ PF బ్యాలన్స్ వివరాలను పొందవచ్చు. అయితే, మీ మొబైల్ నంబర్ UAN పోర్టల్  నందు నమోదు చేసి ఉండాలి మరియు మీ ఐడి ప్రూఫ్ లలో ఒకటైనా UAN తో జత చేసి ఉండాలి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :