EPFO బిగ్ న్యూస్: కోవిడ్ 19 అడ్వాన్స్ ను నిలిపి వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ.!

EPFO బిగ్ న్యూస్: కోవిడ్ 19 అడ్వాన్స్ ను నిలిపి వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ.!
HIGHLIGHTS

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ నుండి బిగ్ అప్డేట్ వచ్చింది

కోవిడ్ 19 అడ్వాన్స్ ని నిలిపి వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ

PF అకౌంట్ నుండి అడ్వాన్స్ పొందడానికి అవకాశం ఇప్పటికి వుంది

EPFO బిగ్ న్యూస్: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. కోవిడ్ 19 కష్టకాలంలో ఉద్యోగస్తుల అవసరార్ధం తీసుకు వచ్చిన కోవిడ్ 19 అడ్వాన్స్ ని నిలిపి వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. 2020 లో కోవిడ్ 19 దెబ్బకి ఏర్పడిన అనిశ్చితి సమయంలో, ఉద్యోగస్తుల ఊరట కోసం ఈ కోవిడ్ 19 అడ్వాన్స్ ను అందించింది. ఈ కోవిడ్ 19 అడ్వాన్స్ ద్వారా ఉద్యోగస్తులు వారి PF అమౌంట్ నుండి పెద్ద మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో తీసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, ఇప్పుడు ఈ వెసులుబాటును తీసివేస్తున్నట్లు ప్రకటించింది.

కోవిడ్ 19 అడ్వాన్స్ అంటే ఏమిటి?

మార్చి 2020 లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKY) క్రింద కోవిడ్ 19 అడ్వాన్స్ ను ప్రవేశపెట్టింది. అలాగే, 2021 జూన్ లో వచ్చిన రెండో వేవ్ సమయంలో కూడా, రెండవ నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ సమయంలో ఉద్యోగస్తులు వారి ఫైనాన్షియల్ అవసరాలకు ఆసరానిచ్చేలా ఈ వెసులుబాటును అందించింది.

EPFO
EPFO

ఉద్యోగస్తులు వారి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో దాచుకున్న మొత్తం లో 75% వరకు అడ్వాన్స్ రూపంలో కోవిడ్ 19 అడ్వాన్స్ ద్వారా అప్లై చేసుకునే వీలు కల్పించింది. ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్ మరియు ఒక్కసారి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

కోవిడ్ 19 అడ్వాన్స్ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా?

కోవిడ్ 19 అడ్వాన్స్ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా? అని అడిగితే, లేదని చెబుతోంది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కొత్త రూల్. ఎందుకంటే, 2024 జూన్ 12 వ తారీఖు నుండి కోవిడ్ 19 అడ్వాన్స్ ను నిలిపి వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి, ఇప్పుడు ఈ కోవిడ్ 19 అడ్వాన్స్ కోసం అప్లై చేసే అవకాశం ఉండదు.

Also Read: లేటెస్ట్ Samsung 4K Smart Tv పైన అమెజాన్ ధమాకా ఆఫర్.!

అయితే, కొన్ని అనివార్య పరిస్థితులు మరియు అవసరాల కోసం కొంత మొత్తాన్ని PF అకౌంట్ నుండి అడ్వాన్స్ రూపంలో పొందడానికి అవకాశం ఇప్పటికీ వుంది. చదువు, పెళ్లి, మెడికల్ మరియు ఇంటి కొనుగోలుతో పాటు ఇంటి మరమత్తులు వంటి అవసరాలకు, PF అడ్వాన్స్ కోసం అప్లై చేయవచ్చు. కానీ, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ ను రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ మొత్తంలో పొందాలంటే, ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్ ద్వారా తీసుకోకపోవడం మంచి ఆలోచనగా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo